ప్రియుడి మోజులో పిల్ల‌ల్ని చంపేసి పరారీ!

Update: 2018-09-02 04:35 GMT
భ‌ర్త‌కు బ్యాంక్ ఉద్యోగం. ముద్దుగా ఉండే ఇద్ద‌రు పిల్ల‌లు. ఏ కుటుంబానికైనా ఇంకేం కావాలి? ఆనందంగా సాగిపోతున్న జీవితాన్ని క్ష‌ణిక సుఖం కోసం కాల‌ద‌న్న‌టం.. మాన‌వ‌త్వాన్ని మ‌రిచి.. మ‌నిషి కాస్తా మృగంగా మారితే ప‌రిస్థితులు ఎలా ఉంటాయ‌న‌టానికి చెన్నైలో చోటు చేసుకున్న ఘోరం వింటే వ‌ణికిపోవ‌టం ఖాయం. బంధాలు.. అనుబంధాల‌పై అనుమానం వ‌చ్చేలా ఉన్న ఈ ఉదంతంలోకి వెళితే..

చెన్నైలోని ప‌ల్లావ‌రం స‌మీపంలోని కుండ్ర‌త్తూర్ కి చెందిన బ్యాంకు ఉద్యోగి విజ‌య్ (34). అత‌డికి అభిరామి(28) తో పెళ్లైంది. వారికి అజ‌య్ (5).. కారుణ్య‌(4) ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. ఇదిలా ఉంటే.. ఒక బిర్యానీ దుకాణంలో ప‌ని చేస్తున్న సుంద‌రం అనే వ్య‌క్తి అభిరామికి ప‌రిచ‌యం కావ‌టం.. అది కాస్తా వివాహేత‌ర సంబంధంగా మారింది.

దీన్ని గ‌మ‌నించిన చుట్టుప‌క్క‌ల వారు విజ‌య్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. అత‌డు భార్య‌ను నిల‌దీశాడు. ఈ క్ర‌మంలో భార్య‌..భ‌ర్త‌ల మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రిగేవి. ఇదిలా ఉండ‌గా.. నెల‌లో చివ‌రి రోజు కావ‌టంతో శుక్ర‌వారం బ్యాంకులో ప‌ని కార‌ణంగా ఇంటికి ఆల‌స్యంగా వస్తాన‌ని భార్య‌కు చెప్పి వెళ్లాడు.

అత‌డు ఇంటికి తిరిగి వ‌చ్చే స‌మ‌యానికి ఇంటి త‌లుపులు మూసి ఉండ‌టంతో.. లైట్లు వెలుగుతూ ఉండ‌టంతో త‌న ద‌గ్గ‌రున్న మ‌రో తాళంతో లోప‌లికి వెళ్లిన అత‌డికి షాక్ త‌గిలింది. ఇద్ద‌రు పిల్ల‌లు నుర‌గ‌లు క‌క్కుకొని ప‌డి ఉండ‌టాన్ని గుర్తించాడు. భోరున విల‌పిస్తూ భార్య కోసం వెత‌గ్గా ఆమె క‌నిపించ‌లేదు. రంగంలోకి దిగిన పోలీసుల‌కు షాకింగ్ విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. త‌న ప్రియుడితో క‌లిసి ఉండేందుకు అడ్డుగా ఉన్న భ‌ర్త‌.. పిల్ల‌ల్ని వ‌దిలించుకోవ‌టానికి వారిని చంపాల‌ని అభిరామి ప్లాన్ చేసిన‌ట్లుగా గుర్తించారు.

ఇందులో భాగంగా పాల‌ల్లో విషం క‌లిపి పిల్ల‌ల‌కు తాగించ‌గా.. వారు బాధ‌తో ఏడుస్తుంటే.. వారిని వ‌దిలేసి.. ప్రియుడు సుంద‌రం బైకు ఎక్కి కోయంబేడు బ‌స్టాండ్ కు వెళ్లి నాగ‌ర్ కోయిల్ బ‌స్సు ఎక్కిన‌ట్లుగా గుర్తించారు. ప్ర‌త్యేక బృందాల‌తో క‌లిసి సుంద‌రంను అరెస్ట్ చేశారు. బ్యాంకు నుంచి ముందుగా వ‌చ్చి ఉంటే.. భ‌ర్త‌ను కూడా చంపాల‌ని అభిరామి ప్లాన్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ప్ర‌స్తుతం పోలీసులు అభిరామి కోసం గాలిస్తున్నారు. పెళ్లి త‌ర్వాత ప్రేమ ఏమిటో? ఆ మోజులో పడి క‌న్న‌బిడ్డ‌ల్ని క‌ర్క‌శంగా చంపుకోవ‌టం షాకింగ్ గా మారాయి. ఈ ఉదంతం స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది.  


Tags:    

Similar News