కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన స్వదేశీ రైళ్లు.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు. మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలతో ఈ రైళ్లను రూపొందించారు. అయితే.. ఇవే ఇప్పుడు సెంటరాఫ్ క్రిటిసిజంగా మారిపోయాయి. పైగా మోడీ కి సైతం మంట పుట్టిస్తున్నాయి.
తాజాగా తన సొంత రాష్ట్రం గుజరాత్ లో జరిగిన ఘటన మరిన్ని విమర్శలకు తావిస్తోంది. ఈ వందే భారత్ రైళ్లు.. ప్రారంభం నుంచి వివాదాలకు కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. ఆదిలో వరుస పెట్టి పశువులను ఢీ కొట్టిన ఈ రైళ్లు.. తాజాగా ఓ మహిళ ప్రాణాలను తీసేశాయని.. నెటిజన్లు విమర్శలు సంధిస్తున్నారు.
గుజరాత్లోని ఆనంద్ ప్రాంతంలో ఓ దుర్ఘటన జరిగింది. ఆనంద్ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతున్న ఓ 54 ఏళ్ల మహిళను ముంబయి వెళ్తున్న సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలు అహ్మదాబాద్కు చెందిన బీట్రైస్ ఆర్కిబాల్డ్ పీటర్గా గుర్తించారు.
మంగళవారం సాయంత్రం సుమారు 4.37 గంటల సమయంలో ట్రాక్ దాటుతుండంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతురాలు ఆనంద్‌లోని ఓ బంధువు వద్దకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే గాంధీనగర్ క్యాపిటల్ స్టేషన్ నుంచి ముంబయి సెంట్రల్‌కు వెళ్తున్న రైలుకు ఆనంద్‌లో స్టాప్ లేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.
కాగా, వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇటీవల తరచూ ప్రమాదానికి గురవుతోంది. అక్టోబరు 6న ముంబయి నుంచి గాంధీనగర్‌కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు గుజరాత్‌లోని వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు గేదెలను ఢీకొట్టింది.
ఈ ఘటనలో రైలు ముందు ప్యానెల్ దెబ్బతిన్నది. అది జరగిన మరుసటిరోజే ఆనంద్ సమీపంలో ఓ ఆవును సైతం ఢీకొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొద్దిరోజులకు మరో రైలు.. పశువులను ఢీకొట్టింది. దీంతో నెటిజన్లు.. తీవ్రస్తాయిలో కామెంట్లు కుమ్మరిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.