దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ సందర్భంగా శుచీశుభ్రత పాటించాలని అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన భర్త స్నానం చేయడం లేదని.. శుభ్రంగా ఉండడం లేదని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. లాక్ డౌన్ వలన ప్రజల జీవన విధానం దెబ్బతింది. గతంలో ఉన్న రోజువారి కార్యకలాపాలు ఇప్పుడు మారిపోయాయి. ఆలస్యంగా నిద్రపోవడం.. ఉదయం ఆలస్యంగా లేవడం.. తినడం.. నిద్రించడం.. సినిమాలు చూడడం... ఆటలు ఆడడం వంటి పనులతో బద్ధకస్తులుగా మారారు. ఈ క్రమంలో వ్యక్తిగత పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. ఈక్రమంలోనే తన భర్త - పాప కూడా ఈ విధంగానే బద్ధకంగా మారి స్నానాలు చేయడం లేదని పోలీసులను ఆశ్రయించడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
కర్ణాటకలోని బెంగళూరు నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తన భర్త స్నానం చేయకుండా తనను ఇబ్బంది పెడుతున్నారని ఓ వివాహిత జయనగర్ పోలీసులను ఆశ్రయించింది. స్నానం చేయకపోవడంతో తన భర్త నుంచి దుర్వాసన వస్తోందని వాపోయింది. ఈ క్రమంలో తన గదిలోనే తనను నిద్రించాలని బలవంతం చేస్తున్నాడని ఆరోపించింది. సాధారణంగా కిరాణ దుకాణం నిర్వహిస్తుండగా లాక్ డౌన్ సమయంలో మినహాయింపు ఇచ్చారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో కిరాణ దుకాణం తెరవకుండా ఇంటి దగ్గరే ఉంటున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే తండ్రిని చూసి తన తొమ్మిదేళ్ల కుమార్తె కూడా స్నానం చేయడం లేదని - పాప స్నానం చేయక వారమైందని పోలీసులకు వివరించారు. వ్యక్తిగత శుభ్రతపై ఎంత చెప్పినా వినడం లేదని - ఈ విషయంలో తమ మధ్య విబేధాలు వచ్చాయని - ఈ క్రమంలో తనపై దాడి చేశాడని వాపోయింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. ఆమె ఫిర్యాదు మేరకు భర్తను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వ్యక్తిగత శుభ్రత పాటించాలని ఈ సందర్భంగా అతడికి పోలీసులు సూచించి పంపించారు. అయితే దీనిపై కేసు ఏమీ నమోదు కానట్టు తెలుస్తోంది.
ఇలాంటి పరిణామాలే ప్రతి ఇంట్లో చోటుచేసుకుంటున్నాయి. కుటుంబసభ్యులంతా ఇంట్లోనే ఉండడంతో ప్రైవసీ కోల్పోయారు. దీంతోపాటు ఒకరి మాట ఒకరు వినడం లేదు. దీంతో వారి మధ్య బేధాభిప్రాయాలు వచ్చి వాగ్వాదం చోటుచేసుకునే దాక పరిస్థితులు మారుతున్నాయి. ఈ విధంగా కరోనా కుటుంబాల మధ్య చిచ్చు పెడుతోంది. లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు.