గర్భగుడిలోకి తడి దుస్తులతో రమ్మన్నా బాధేనా?
మరే మతం మీదా లేనంత ఎక్కువగా హిందూ మత విశ్వాసాల మీదా సంప్రదాయాల మీదా దాడి జరుగుతోంది. ప్రతి వ్యవస్థలోనూ కొన్ని నియమాలు ఉంటాయి. మారిన కాలంతో పాటు అలాంటి వాటిలో మార్పులు తెస్తారు. దేశంలో దేవాలయాలు అన్నవి లేక.. ఉన్నవి రెండో.. మూడో అయితే.. వాటిల్లోకి ఎందుకు అనుమతించరని ప్రశ్నించటంలో తప్పు ఉండదు. వీధికి ఒకటి చొప్పున గుడి ఉన్నప్పుడు.. దేవుడ్ని పూజించుకోవటానికి ఎన్నో అవకాశాలున్నా.. మహిళల్ని అనుమతించని గుళ్ల మీద పడటం ఏమిటో ఒక పట్టాన అర్థం కాదు.
దేశం మొత్తమ్మీదా మహిళల్ని అనుమతించని దేవాలయాలు చాలా తక్కువగా ఉంటాయి. నిజానికి ఆయా గుళ్లకు మహిళల్ని అనుమతించకపోవటానికి కారణాలు లేకపోలేదు. వీటిని వదిలేసి.. కొందరు మాత్రం ఆయా గుళ్లలోకి మహిళల్ని అనుమతించాలంటూ పోరాటాలు చేయటం.. ఇలా పోరాటాలు చేసే వారంతా వామపక్ష భావజాలంతో సంబంధాలు ఉన్న వారు కావటం గమనార్హం.
ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. ఈ వామపక్ష భావజాలం ఉన్న వారంతా హిందూ మత విశ్వాసాల మీద తరచూ పోరాటం చేస్తారు. ఇతర మతాల్లో ఉన్న దారుణమైన నియమాల గురించి.. సంప్రదాయాల గురించి పల్లెత్తు మాట అనరు. స్వాముల్ని తప్పు పట్టటం.. వారిని దుర్మార్గులుగా చిత్రీకరించటం.. వారిని బఫూన్లుగా చెప్పే వామపక్షవాదులు.. తమ మాటలతో కళ్లు లేని వారికి చూపును.. నడవలేని వారికి నడకను తీసుకొస్తామంటూ సభలు నిర్వహిస్తుంటే.. అదెలా సాధ్యమన్న ఒక్క మాట అడిగిన పాపాన పోరు.
ఇటీవల చోటు చేసుకున్న ఆందోళనలతో మహారాష్ట్రలోని శని సింగనాపూర్.. త్రయంబకేశ్వర్ దేవాలయాల్లో మహిళలకు అనుమతులు ఇవ్వటం తెలిసిందే. అయితే.. త్రయంబకేశ్వర్ గర్భగుడిలోకి ప్రవేశించే మహిళలు విధిగా నూలువస్త్రాలు.. సిల్క్ దుస్తులు ధరించాలని.. తడి దుస్తులతోనే రావాలంటూ నిబంధనను పెట్టారు. గర్భగుడిలోకి వెళ్లటానికి అనుమతించాలంటూ పోరాడిన పుణెకి చెందిన వనితా గుత్తె అండ్ కో ఇప్పుడీ నిబంధన మీద గుర్రుగా ఉన్నారు. అయితే.. ఈ పోరాటాలు చేసే బృందాల వారు వామపక్ష భావజాలంతో అనుబంధం ఉన్న వారు కావటం గమనార్హం.
నిజంగా దేవుడి మీద భక్తి ఉన్న వారు.. అక్కడి విశ్వాసాలకు విలువ ఇస్తారు. అంతేకాదు.. మూర్ఖత్వంతో.. మొండితనంతో తాము కోరుకున్నట్లే జరగాలని అనుకోరు. కోర్టులు సైతం.. ఇలాంటి వారి విషయంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది భావనల్ని సంతృప్తి పర్చటం కోసం.. ఎంతోమంది విశ్వాసాలకు భంగం వాటిల్లేలా కోర్టులు నిర్ణయాలు తీసుకోవటం ఏమిటన్నది ఒక పెద్ద ప్రశ్న. వామపక్షభావజాలంతో నిండి ఉంటే మీడియాలోని కొన్ని గ్రూపులు సైతం.. ఇలాంటి వాటికి విశేష ప్రాధాన్యత ఇవ్వటం చూస్తే.. ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్లుగా అనిపించక మానదు. గుళ్లలోకి మహిళల్ని అనుమతించే వారంతా నిజంగా మతవిశ్వాసం మీద నమ్మకం ఉంటే.. వారింట్లో పూజలు చేస్తారా? అన్న విషయాన్ని క్రాస్ చెక్ చేసుకుంటే అసలు విషయాలు బయటకొచ్చే అవకాశం ఉంది.