తాగి.. గుద్దేసి ఎంత రచ్చ చేసిందంటే..

Update: 2017-01-10 07:04 GMT
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పురుషులు.. ప్రముఖులు పట్టుబడటం తెలిసిన విషయాలే. కానీ.. ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలో సరికొత్త ధోరణి కనిపిస్తోంది. తాగి కారును డ్రైవ్ చేస్తే చోటు చేసుకునే ప్రమాదాలు ఎంత తీవ్రంగా ఉంటాయో నగరంలో చోటు చేసుకున్న విషాదాలు అందరికి తెలిసినవే. అయినప్పటికీ.. తాగే వారిలో మాత్రం మార్పు రానట్లుగా కనిపిస్తోంది. గతానికి భిన్నంగా ఇప్పుడు తాగి డ్రైవ్ చేస్తున్న అమ్మాయిలు ఎక్కువైపోతున్నారు. మగాళ్ల మాదిరే.. కార్లలోనే దుకాణం పెట్టేసిన తీరు ఇప్పుడు విస్మయకరంగా మారింది.

తాగి డ్రైవ్ చేయటం ఒక ఎత్తు అయితే.. తాగి ఇష్టారాజ్యంగా డ్రైవ్ చేసి ప్రమాదాలకు పాల్పడటం మరో ఎత్తుగా చెప్పాలి. వెధవ పని చేయటమే కాదు.. దాన్ని సమర్థించుకునే క్రమంలో దురుసుగా వ్యవహరించిన ఘటన ఒకటి హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సోమవారం అర్థరాత్రి వేళలో బంజారాహిల్స్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిచారు. ఈ సందర్భంగా పూటుగా తాగేసిన ఒక యువతి మత్తుతో కారును వేగంగా నడపటమే కాదు.. ఒక బైక్ ను.. కారును గుద్దేసింది. ఈ ప్రమాదంలో కొందరు స్వల్పంగా గాయపడ్డారు. తాగేసి డ్రైవ్ చేయటమే ప్రమాదానికి కారణంగా చెబుతున్నారు. మద్యం మత్తులో ఉన్న మహిళతో పాటు.. మరో మహిళా ఉన్నారు. ఇద్దరూ కారులోనే తాగుతున్నారన్న విషయం.. కారులో ఉన్న మద్యం గ్లాసులు చెప్పకనే చెప్పేశాయి. ఇదంతా చూసిన వారు షాక్ అయిన పరిస్థితి.

ఇదిలా ఉండగా.. తాగేసి దురుసు డ్రైవింగ్ తో కారును.. బైకును ఢీ కొట్టిన యువతి.. పోలీసుల మీదా.. బాధితుల మీదా విరుచుకుపడటం సంచలనంగా మారింది. తాగి నడపటమేకాదు.. ప్రమాదానికి కారణమైన యువతిని ప్రశ్నించిన పోలీసులపై చెలరేగిపోయిన వైనం సంచలనంగా మారింది. స్థానికుల సాయంతో సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

ప్రమాదానికి కారణమైన యువతిని పోలీసులు ప్రశ్నించే క్రమంలో ఆమె దురుసుగా సమాధానం చెప్పటమే కాదు.. ఆగ్రహంతో వేసిన చిందులు సంచలనంగా మారాయి. తప్పు చేసింది కాక.. వాటిని సమర్థించుకునేలా వ్యవహరించటం.. అందులో భాగంగా పోలీసుల పట్ల దురుసుగా వ్యవహరించిన తీరు చర్చనీయాంశంగా మారింది. నిందితురాలు ఒక ప్రైవేటు యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఆమెకు సంబంధించిన వివరాలు మరిన్ని బయటకు రావాల్సి ఉంది.
Full View


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News