టీఆర్ ఎస్ లో మహిళా నేతలకు ప్రాధాన్యం కరువైంది. తెలంగాణ ఉద్యమంలో పురుషులతో సమానంగా పోరాటాలు చేసినప్పటికీ తమకు సరైన గుర్తింపు దక్కడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చి ఆరేళ్లు అవుతున్నా - పార్టీ పదవులు - నామినేటెడ్ పోస్టుల్లో తమకు అవకాశాలు ఇవ్వడంలేదని పార్టీ అధిష్టానం మీద గుర్రుగా ఉన్నారు. ఇదే విషయంపై కేసీఆర్ కు - కేటీఆర్ కు తమ గోడు వెళ్ల బోసుకుంటున్నా - హైకమాండ్ కనికరించడం లేదట. టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు - క్యాబినెట్ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు.
అటు ప్రతిపక్షాల నుంచి ఇదే అంశంపై పదేపదే ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నా - గులాబీ బాస్ పట్టించుకోలేదు. టీఆర్ ఎస్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత మంత్రివర్గంలో మహిళలకు చోటు దక్కలేదు. స్థానిక సంస్థలు - మార్కెట్ కమిటీల్లో యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేసినా - నామినేటెడ్ పోస్టుల్లో - పార్టీ పదవుల్లో మాత్రం మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని టీఆర్ ఎస్ లో చర్చ జరుగుతోంది. త్వరలో నే ఇద్దరు మహిళలను తమ క్యాబినెట్ లోకి తీసుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ - ఇంత వరకు అది కార్యరూపం దాల్చలేదు. దీంతో మహిళా నేతలు ఆవేదనతో రగిలిపోతున్నారు.
కాంగ్రెస్ లో విజయశాంతి లాంటి నేతలు అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నా.. టీఆర్ ఎస్ లో మాత్రం ప్రస్తుతం మహిళా నేతల వాయిస్ ఎక్కడా వినిపించడంలేదు. ఇతర పార్టీల నుంచి టీఆర్ ఎస్ లోకి వచ్చిన ఒకరిద్దరు మహిళా నేతలను మినహా - అసలు ఉద్యమకారులను పక్కనపెట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు వేస్తున్నప్పటికీ - మహిళా నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. నామినెటేడ్ పోస్టుల్లో తమకు అవకాశాలు ఇవ్వాలని పదేపదే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు విన్నవించుకోవాలనుకున్నా - తగినంత సమయం ఇవ్వడం లేదనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది. తెలంగాణ భవన్ చట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా - కనీసం పార్టీ ముఖ్యనేతలు తమను పట్టించుకున్న పాపాన పోలేదని కొందరు మహిళా నేతలు మదన పడుతున్నారు.