మహాభారతం ఇక రిపీట్ అయ్యింది. ఒక మహిళ లూడో ఆడుతున్నప్పుడు తనను తాను ఫణంగా పెట్టుకుంది. ఆపై తన యజమాని చేతిలో ఓడిపోయింది. అనంతరం యజమానికి బానిసగా వెళ్లిపోయింది.
రాజస్థాన్‌లోని జైపూర్‌లో పనిచేసే భర్త పనిచేస్తూ పంపిన డబ్బుతో రేణు అనే మహిళ జూదం ఆడుతూ ఎంజాయ్ చేస్తోంది. అయితే డబ్బు వృథా చేస్తూ సర్వం పోగొట్టుకొని చివరకు జూదంలో తననే తానే అర్పించుకుంది. ఈ సంఘటన నగర్ కొత్వాలిలోని దేవ్‌కలి ప్రాంతంలో జరిగింది.
ఈ మహిళ లూడో గేమ్‌కు బానిసైంది. ఆమె తన ఇంటి యజమానితో రోజూ జూదం ఆడేది. గత వారం వారిద్దరూ గేమ్ ఆడుతూ పందెం కాస్తుండగా.. డబ్బు మొత్తం అయిపోవడంతో ఆ మహిళ తనను ఫణంగా పెట్టింది. చివరకు ఆ యజమాని ఆమెను తీసుకెళ్లిపోయాడు.
భర్తకు ఫోన్ చేసి జరిగిన మొత్తం చెప్పింది. ఆమె భర్త ప్రతాప్‌గఢ్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.
తాను దేవ్‌కలిలో అద్దె ఇంట్లో ఉండేవాడినని రేణు భర్త పేర్కొన్నాడు. ఆరు నెలల క్రితం అతను జైపూర్‌కు పని కోసం వెళ్లి తన భార్యకు డబ్బు పంపిస్తూనే ఉన్నాడు, ఆమె జూదం కోసం ఉపయోగిస్తూ వృథా చేస్తోంది.. డబ్బు అయిపోయిన తర్వాత, ఆమె లూడోపై పందెం వేసి తనను తాను పందెంలో కోల్పోయింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.
జూదంలో ఓడిపోవడంతో ఈ మహిళ ఇప్పుడు ఇంటి యజమానితో కలిసి జీవించడం ప్రారంభించింది. "నేను ఆమెను విడిచిపెట్టాలని ప్రయత్నించాను. కానీ ఆమె తిరిగిరావడం లేదు అని ఆ భర్త వాపోయాడు.
ఈ విషయంపై పోలీసులు స్పందించారు."మేము ఆ యజమానిని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాము. అతనిని సంప్రదించిన వెంటనే విచారణ ప్రారంభిస్తాము" అని చెప్పారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.