పేదల స్థలాల్లో బలవంతంగా అన్న క్యాంటీన్లు!

Update: 2018-07-09 13:06 GMT
దేశంలోని ఎన్నో రాష్ట్రాలు సమర్థంగా నిర్వహిస్తున్న రూ.5 భోజన క్యాంటీన్ల ఏర్పాటు ఏపీలోనూ ఎట్టకేలకు మొదలవుతోంది. నాలుగేళ్లుగా కిందామీదా పడి ఎట్టకేలకు క్యాంటీన్లను ప్రారంభిస్తున్నారు. అయితే... రూ.5కి భోజనం పెట్టే ఈ క్యాంటీన్ల కోసం తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళ స్థలాన్ని ఎంపిక చేయడం వివాదంగా మారింది. తన సొంత స్థలంలో ఇలా ప్రభుత్వ క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి రావడంతో ఆమె అధికారులకు మొరపెట్టుకుంది. వారు వినకపోవడంతో ఆత్మహత్యకు యత్నించింది.
    
తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జాలా కన్య మరియు  జాలా పుష్పల తండ్రికి ప్రభుత్వం 1983లో స్థానిక మున్సిపల్‌ సెంటర్‌ లో రెండున్నర సెంట్లు ఇచ్చింది. అన్న క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తామంటూ మున్సిపల్‌ అధికారులు ఆదివారం ఆ స్థలం వద్దకు వచ్చారు. దీంతో మరియ అధికారులను అడ్డుకుంది. అయినా కూడా వారు వినకపోవడంతో పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంతలో స్థానికులు - ఆమెను అడ్డకున్నారు. విషయం తెలుసుకున్న పెద్దాపురం ఎస్ ఐ కృష్ణ భగవాన్‌ ఘటనాస్థలికి చేరుకుని ఆమెను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
    
అయితే.. అధికారుల వాదన మరోరకంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకోకపోతే.. ఆ స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అందుకే ఆ స్థలంలో క్యాంటీన్‌ ఏర్పాటు చేయాలనుకున్నామన్నారు. కాగా, రోడ్డు విస్తరణ వల్ల ఇంటి నిర్మాణం ఆలస్యమైందని బాధితురాలు చెప్పింది. విస్తరణలో పోగా మిగిలిన స్థలంలో ఇల్లు నిర్మించుకుందామనుకుంటే.. ప్రభుత్వమిలా క్యాంటీన్‌ ఏర్పాటు చేస్తామనడం ఎంత వరకు సమంజసమని బాధితులు ఆవేదన చెందుతన్నారు.
Tags:    

Similar News