ఊహించని ఘటన చోటు చేసుకుంది. తిరుమల పర్యటనలో ఉన్న ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్ కాన్వాయ్ కు ఒక మహిళ అడ్డు పడ్డారు. ఈ రోజు (బుధవారం) ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని పద్మావతి అతిథి గృహంలో టిఫిన్ తిన్నాక.. రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు బయలుదేరారు జగన్.
ఆ సమయంలో పద్మావతి అతిథి గృహం వద్ద జగన్ కాన్వాయ్ కి అడ్డు పడ్డారో మహిళ. ఆమెను భద్రతా సిబ్బంది లాగేశారు. దీంతో ఆమెకు స్వల్ప గాయమైంది. వెంటనే కాన్వాయ్ ను ఆపిన జగన్.. ఆ మహిళను దగ్గరకు పిలిపించుకొని మాట్లాడారు.
తమది తూర్పుగోదావరి జిల్లా అమలాపురమని.. తన భర్తకు ఉద్యోగం కావాలంటూ ఆమె వేడుకున్నారు. ఆమె సమస్యను తెలుసుకున్న జగన్.. వివరాలు సేకరించారు. అనంతరం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి వెళ్లారు. కాన్వాయ్ లోకి వచ్చే వారిని అడ్డుకునే భద్రతా సిబ్బందిని వారించి.. వారి వేదనను తెలుసుకునే ప్రయత్నం చేసిన జగన్ తీరును పలువురు ప్రశంసిస్తున్నారు.