బురఖా బ్యాన్.. ‘స్విస్’లో కొత్త రూల్..?

Update: 2015-11-25 12:58 GMT
అవును.. బురఖాను బ్యాన్ చేశారు. బురఖా వేసుకొని స్విట్జర్లాండ్ లోని టెసినో రాష్ట్రంలో పర్యటించటం చట్టవిరుద్ధం. ఒకవేళ ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తూ బురఖా ధరిస్తే.. వారికి మన రూపాయిల్లో రూ.6500 నుంచి రూ.6.5లక్షల వరకు జరిమానా విధించాలని నిర్ణయించారు. బురఖా దరించటాన్ని బ్యాన్ చేస్తూ గతంలో కొన్ని దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా స్విట్జర్లాండ్ లోని టిసినో రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

దీనికి సంబంధించి ఆ రాష్ట్రం రెఫరెండమ్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ప్రతి ముగ్గురిలో ఇద్దరు.. ముస్లిం మహిళలు బురఖాలు ధరించటాన్ని నిషేధించాలన్న మాటకు అనుకూలంగా ఓటేయటం గమనార్హం. ఈ రాష్ట్రం తీసుకున్న నిర్ణాయన్ని స్విస్ కేంద్ర సర్కారు కూడా ఆమోదించింది. ప్రస్తుతం రెఫరెండం ద్వారా కొత్త నిబంధనను తీసుకొచ్చినప్పటికీ.. ఎప్పటి నుంచి దీన్ని అధికారికంగా అమలు చేస్తారన్న అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తాజా నిబంధన అమల్లోకి వస్తే.. షాపింగ్ మాల్స్.. దుకాణాలు.. బహిరంగ ప్రదేశాల్లో బురఖా వేసుకొని తిరగకూడదు.

అయితే.. స్విట్జర్లాండ్ మొత్తం ఈ నిబంధన లేని నేపథ్యంలో.. ఈ రాష్ట్రంలోకి వచ్చే విదేశీయులకు ఈ విషయం ముందుగా తెలియజేసేలా.. ఎయిర్ పోర్ట్ లలో ప్రముఖంగా ప్రచారం చేయటంతో పాటు.. ప్రయాణికులకు అవగాహన కలించేలా చర్యలు తీసుకోనున్నారు. అయినప్పటికీ ఎవరైనా కానీ చట్టాన్ని ఉల్లంఘిస్తే.. అలాంటి వారికి భారీగా జరిమానా విధించాలని నిర్ణయించారు. ఉగ్రవాద కార్యకలాపాలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News