వాళ్లు జాతీయగీతం ఆలపిస్తే నేను ప్రమాణం చేస్తా..

Update: 2019-01-18 08:29 GMT
బీజేపీ నుంచి తెలంగాణలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. గోషామహల్ నుంచి ఈయన గెలువగా.. హేమాహేమీలైన బీజేపీ నాయకులు ఈ దఫా ఓడిపోయారు. గెలిచిన ఈ ఒక్క బీజేపీ ఎమ్మెల్యే కూడా తెలంగాణ శాసనసభలో ప్రొట్రెం స్పీకర్ గా ఎంఐఎం సీనియర్ నేత ముంతాజ్ అహ్మద్ ను నియామించడాన్ని తప్పుపట్టారు. ఆయన ముందు తాను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని భీష్మించుకు కూర్చున్న సంగతి తెలిసిందే. అన్నట్టుగానే తొలిరోజు అసెంబ్లీలో రాజాసింగ్ పంతం మేరకు ప్రమాణం చేయలేదు.

తాజాగా రాజాసింగ్ మరో సారి ఎంఐఎంపై విరుచుపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో ఎంఐఎం ఎమ్మెల్యేలు జాతీయ గీతాలాపన చేస్తే తాను అసెంబ్లీలో ప్రమాణం చేస్తానని సవాల్ విసిరారు..తనకు ఎంఐఎం నాయకులతో తప్పితే ఎవరి మీద కోపం లేదని... ఎవ్వరున్నా వారి ఎదుట ప్రమాణం చేస్తానని స్పష్టం చేశారు. శుక్రవారం కొత్త స్పీకర్ పోచారం ఎదుట ప్రమాణం చేస్తానని వివరించారు. శుక్రవారం పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. రాజాసింగ్ స్పీకర్ చాంబర్ లో ప్రమాణం చేశారు.

కాగా ఎప్పుడు మతపరమైన విషయాలు.. ఎంఐఎం - ముస్లింలంటేనే ఒంటికాలిపై లేసే గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తన తీరు మార్చుకోవడం లేదు. గడిచిన ఎన్నికల్లోనూ మతవిద్వేషాలు రెచ్చగొట్టే గెలిచారు.ఈసారి అదే పంథా అనుసరిస్తున్నారు. ప్రొట్రెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే ఉండడంతో ప్రమాణ స్వీకారం చేయనని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. బీజేపీ లాంటి జాతీయ పార్టీలో ఉండి ఆయన ఇలా వ్యవహరించడం ’ఆ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారుతోంది.


Full View

Tags:    

Similar News