అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు వలసదారులకు ఊపిరి సలపని వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఏకకాలంలో ఇటు గ్రీన్ కార్డ్ ఆశావహులను అటు డ్రీమర్స్ విషయంలో ట్రంప్ ప్రకటన ఆసక్తికరంగా మారింది.
అమెరికాలో ఉద్యోగం చేస్తూ అక్కడే శాశ్వతంగా నివాసించాలనుకునే భారతీయులు ఇక నుంచి పలు అడ్డంకులు ఎదుర్కొనున్నారు. నివాసానికి అవసరమైన అనుమతి పత్రాన్ని పొందేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకురాబోతుంది. ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రకటించింది. దీంతో గ్రీన్ కార్డును పొందాలనుకునే భారతీయులు ఇక నుంచి మరిన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు. గ్రీన్ కార్డ్ పొందేందుకు యూఎస్ హోల్యాండ్ విభాగం నిర్వహించే మౌఖిక పరీక్షలో నెగ్గితేనే శాశ్వత నివాసానికి అనుమతిస్తారు.
గతంలో హెచ్1బీ వర్క్ వీసాతో సులభంగా గ్రీన్ కార్డు మంజూరు అయ్యేది. అయితే, ఇక నుంచి హెచ్1బీ వీసాదారులందరికీ గ్రీన్ కార్డు ఇచ్చేందుకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ (యూఎస్ సీఐఎస్) నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. దీంతో గ్రీన్ కార్డు పొందాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. సాంకేతికంగా మార్పులు చేస్తూ ఆగస్టు 28న ఈ మేరకు ట్రంప్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ఓపీటీ నుంచి హెచ్1బీ పొందిన వారంతా ఇక గ్రీన్ కార్డు కోసం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొననున్నారు. అయితే, కొంతమంది అక్రమదారుల్లో హెచ్1బీ వీసా పొందారని అలాంటి వారికి యూఎస్ సీఐఎస్ నిర్వహించే ఇంటర్వ్యూలో నెగ్గకపోతే ఇంటి దారి పట్టాల్సి ఉంటుంది. ఎన్ పీజెడ్ లా సంస్థ మేనిజింగ్ అటార్నీ డేవిడ్ హెచ్ నచ్ మెన్ మాట్లాడుతూ… కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డు పొందేందుకు యూఎస్ సీఐఎస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోందని వెల్లడించారు. ఉద్యోగ వీసాతో అమెరికాలో ఉంటూ గ్రీన్ కార్డు పొందాలనుకునే వారు ఇంటర్వ్యూలకు తప్పకుండా హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు.
కాగా, 2010 నుంచి 2014 మధ్య హెచ్-1బీ వీసా కల్గిన రెండు లక్షల మందికి గ్రీన్ కార్డులు వచ్చినట్లు బాపిస్టిన్ పాలసీ సెంటర్ తన నివేదికలో తెలిపింది. యూఎస్ సీఐఎస్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2015లో 34,843 మంది భారతీయులు తమ తాత్కాలిక వీసా స్టేటస్ ను సవరించుకొని గ్రీన్ కార్డులు పొందారు. ఇందులో 25,179 మంది హెచ్1బీ కేటగిరిలో అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవారన్న విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా...పసితనంలో అమెరికాకు వలసవెళ్ళిన యువత భవిష్యత్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నోరు విప్పనున్నారు. ఈ మేరకు అర్థరాత్రి శ్వేతసౌధ మీడియా ఉన్నతాధికారి సారా సాండర్స్ పేర్కొన్నారు. పసితనంలో అక్రమంగా అమెరికాలోకి చొరబడిన చిన్నారులక రక్షణ కల్పించిన ఒబమా విధానానికి ట్రంప్ చరమగీతం పాడనున్నట్లు తెలిపారు. దీనిపై వచ్చేవారంలో ట్రంప్ కీలక నిర్ణయం వెల్లడిస్తారని చెప్పారు. ఒబమా ప్రతిపాదించిన ఈ విధానాన్ని ట్రంప్ కుహనా డ్రీమర్స్ ప్రొగ్రామ్‌గా అభివర్ణించారు. అక్రమదారుల్లో సుమారు ఎనిమిది లక్షల మంది చిన్నారులు అమెరికాలో నివాసముంటున్నట్లు పేర్కొన్నారు. ఇటువంటి విధానాల వల్ల అమెరికా ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. వీరందరికీ ఒబమా ప్రభుత్వం ‘డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ ప్రొగ్రామ్’ కింద రక్షణ కల్పించిందని చెప్పారు. అయితే, ట్రంప్ ఎటుంటి నిర్ణయం వెలువరిస్తారో అన్న విషయంపై డ్రీమర్స్‌లో కూడా ఆందోళన నెలకొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఒబమా విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలు సాఫ్ట్ వేర్ కంపెనీల సీఈఓలు కూడా తీవ్రంగా స్పందించారు. ఈ నిర్ణయం ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్స్ జుకర్‌బర్గ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ళ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ ఈ ప్రొగ్రామ్ ను తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. మొత్తంగా ట్రంప్ ఏం చేయనున్నారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.