తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. కరోనా కేసులు క్రమక్రమంగా పెరిగిపోతున్న నేపథ్యంలో గచ్చిబౌలి లో కరోనా పేషేంట్స్ కోసం ప్రత్యేక హాస్పిటల్ కూడా నిర్మిస్తోంది. కరోనా వెలుగుచూసిన చైనాలో కరోనా భాదితుల కోసం చైనా ఎనిమిది రోజుల్లోనే 1000 పడకల కరోనా ఆస్పత్రిని కట్టింది.. దాన్ని మించేలా 1500 పడకల ఆస్పత్రిని కడుతోంది తెలంగాణ ప్రభుత్వం. అదీ కేవలం పది రోజుల్లోనే. దాని కోసం దాదాపు వెయ్యి మంది కార్మికులు రాత్రి - పగలు శ్రమిస్తున్నారు.
అత్యాధునిక వైద్య సదుపాయాలతో దేశంలోనే అతి పెద్ద కరోనా ఆస్పత్రిని సిద్ధం చేస్తోంది. కరోనా వల్ల ఎదురయ్యే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. దానికి తగ్గట్టే హైదరాబాద్ శివారులో ఉన్న గచ్చిబౌలిలో 1500 పడకల ఆస్పత్రిని రెడీ చేస్తున్నారు. ఇప్పటి వరకు స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన ఓ కాంప్లెక్స్ ను పూర్తిగా కరోనా ఆస్పత్రిగా మార్చేస్తున్నారు. 13 అంతస్తులున్న ఈ భవనంలో ఆస్పత్రికి సంబంధించి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు.
13 అంతస్తులతో ఆస్పత్రి భవనం ఉండనుండగా... ప్రతీ ప్లోర్ లో 36 గదులను ఏర్పాటు చేశారు. మొత్తం 468 గదులు ఉండగా 1200 నుంచి 1500 బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో పడకకు కనీసం ఆరు మీటర్ల దూరం ఉండేట్టు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతీ బెడ్ కు టేబుల్ - చెయిర్ - లాకర్ సదుపాయం ఏర్పాటు చేసారు. ఏప్రిల్ 15 లోగా ఆస్పత్రిని పూర్తి చేసి - కరోనా రోగులందరిని ఈ ఆస్పత్రికి తరలించనున్నారు. వైద్యం అందించేందుకు డిప్యూటేషన్ మీద 70 మంది డాక్టర్లను - 120 మంది నర్సులను - పారా మెడికల్ స్టాఫ్ ను సిద్ధంగా ఉంచారు. వైరస్ కేసులు పెరగడంతో మరొ ఆస్పత్రి అవసరం అని ప్రభుత్వం భావించి.. గచ్చిబౌలిలో ఆస్పత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇటీవల ఆస్పత్రి నిర్మాణ పనులను మంత్రులు కేటీఆర్ - ఈటల రాజేందర్ పరిశీలించారు. వీలైనంత త్వరంగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు.