గ్రేట్ రిక‌వ‌రీ: వెన‌క్కి వ‌చ్చేసిన రూ.3ల‌క్ష‌ల కోట్లు!

Update: 2015-09-09 12:10 GMT
బేర్ స్వైర విహారంలో ర‌క్త‌మోడుతున్న స్టాక్ మార్కెట్ లతో మ‌దుపుదారుల గుండెల్ని పిండి చేసేస్తున్న సంగ‌తి తెలిసిందే. కంటి ముందే క‌రిగిపోతున్న సంప‌ద‌ను చూసి ఏమీ చేయ‌లేక‌.. బేల‌గా ఉన్న మ‌దుప‌రి ముఖంలో ఇప్పుడిప్పుడే క‌ళ తిరిగి వ‌స్తోంది.

గ‌త ప‌దిరోజుల వ్య‌వ‌ధిలో ల‌క్ష‌ల కోట్ల రూపాయిల మేర ఇన్వెస్ట‌ర్ల సొమ్ము హార‌తిక‌ర్పూరంలా కాలిపోయిన దెబ్బ‌కు ల‌క్ష‌లాది మంది బ‌తుకులు బ‌జారున ప‌డిన ప‌రిస్థితి. దీనికితోడు..ఆగ‌ర్భ శ్రీమంతుల సంప‌ద కూడా భారీగా ప‌త‌న‌మైన దుస్థితి. ఈ నేప‌థ్యంలో మార్కెట్ లు జోరుగా సాగ‌టానికి.. స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగియ‌టానికి ఏం చేయాలో అంద‌రూ త‌ల‌లు ప‌ట్టుకుంటున్న వేళ‌.. తాజాగా మార్కెట్ లు లాభాల ప‌ట్ట‌టం శుభ‌సూచ‌కంగా భావించాలి.

గ‌త రెండు సెష‌న్ ల‌లో స్టాక్ మార్కెట్ లాభాల బాట ప‌ట్టి వంద‌లాది పాయింట్లు రిక‌వ‌రీ అవుతున్న వేళ‌.. ఆవిరైపోయిన సంప‌ద కూడా రిక‌వ‌రీ కావ‌టం సంతోష‌క‌ర ప‌రిణామంగా చెప్పాలి.

గ‌త రెండు రోజులుగా పెరుగుతున్న స్టాక్ మార్కెట్ కార‌ణంగా మూడు శాతానికి పైగా పెర‌గ‌టంతో చేజారిపోయిన రూ.3ల‌క్ష‌ల కోట్లు వెన‌క్కి వ‌చ్చేశాయి. మంగ‌ళ‌వారం లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్‌.. బుధ‌వారం కూడా అదే జోరుతో ఉండ‌టం.. ఇన్వెస్ట‌ర్ లు భారీగా కొనుగోళ్లు జ‌ర‌ప‌టంతో బేర్ బెంబేలు త‌గ్గి.. బుల్ ర‌న్ మొద‌లైంది. తాజాగా పెరిగిన సంప‌ద‌తో స్టాక్ మార్కెట్ విలువ 94,91,922కోట్ల‌కు చేరింది. మంగ‌ళ‌వారం 424 పాయింట్లు లాభ‌ప‌డ‌గా.. బుధ‌వారం 402 పాయింట్లు లాభ‌ప‌డింది. దీంతో.. కేవ‌లం రెండు రోజుల వ్య‌వ‌ధిలో 826పాయింట్లు లాభ‌ప‌డ‌టంతో స్టాక్ విలువ‌లు భారీగా పెరిగాయి. దీంతో.. స్టాక్ మార్కెట్ ప‌ర‌ప‌తి రూ.3ల‌క్ష‌ల కోట్ల మేర పెరిగింది. ప‌ది రోజుల్లో పోయాయి అనుకున్న దాదాపు 8ల‌క్ష‌ల కోట్ల‌లో 40 శాతం రెండు రోజుల్లో రిక‌వ‌రీ కావ‌టం మార్కెట్ సెంటిమెంట్ ను మ‌రింత బ‌ల‌పడేలా చేస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. తాజా ప‌రిణామాన్ని గ్రేట్ రిక‌వ‌రీగా మార్కెట్ నిపుణులు అభివ‌ర్ణిస్తున్నారు.
Tags:    

Similar News