కంటికి కనిపించని కరోనాతో యావత్ ప్రపంచం గడగడలాడిపోతోంది. ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని ఎన్నో సీన్లు.. కరోనా పుణ్యమా అని బయటకు వస్తున్నాయి. ప్రపంచంలోని చాలా పరిమిత దేశాలు తప్పించి.. కరోనా పడుగ నీడ పడని దేశాలు చాలా తక్కువనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే.. కరోనా పాజిటివ్ కేసులు దగ్గర దగ్గర నలభై లక్షలకు దగ్గర పడుతుంటే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 2.62లక్షలకు దాటేసింది.
కనుచూపు మేర కరోనా ప్రబావం తగ్గేలా కనిపించట్లేదు. చైనాలోని వూహాన్ లో కంట్రోల్ చేసిన తీరులో ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసే అవకాశం తక్కువనే చెబుతున్నారు. వైరస్ వ్యాప్తికి కట్టడి చేసే వ్యాక్సిన్ రాకకు మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరగటంతో పాటు.. మరణాలు కూడా పెద్ద ఎత్తున చోటు చేసుకునే వీలుందని చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్ని చూస్తే.. ఒక ఆసక్తికర అంశం బయటకు వస్తుంది. ప్రపంచంలోని పది దేశాల్లో నమోదైన కరోనా కేసులే సగానికి పైగా ఉన్న విషయం గణాంకాల్ని చూస్తే.. ఇట్టే అర్థమవుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాల్లోకలిపి పాజిటివ్ కేసుల సంఖ్య 39 లక్షలకు కాస్త దూరంలో ఉంటే.. పది దేశాల్లో పాజిటివ్ కేసులే యాభై శాతానికి పైనే ఉండటం గమనార్హం.
కేసుల నమోదులో అగ్రరాజ్యం అమెరికాలో అత్యధికమని చెప్పాలి. ఇప్పటి వరకూ ఆ దేశంలో 12.74 లక్షల కేసులు నమోదు కాగా.. 75,558 మరణాలు నమోదయ్యాయి. తర్వాతి స్థానంలో స్పెయిన్ ఉంది. ఆ దేశంలో 2.56లక్షల కేసులు నమోదు కాగా.. మరణాలు 26,070.. మూడోస్థానంలో ఇటలీ నిలిచింది. ఆ బుజ్జి దేశంలో 2.15లక్షల పాజిటివ్ లు నమోదు కాగా.. 29,958 మంది మరణించారు.
తొలుత కరోనా పాజిటివ్ కేసులు పెద్దగా లేవన్న మాట వినిపించిన రష్యాలో.. వైరస్ బాధితుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఆ దేశంలో గురువారం అర్థరాత్రి వరకు 1.77లక్షల కేసులు నమోదైతే.. 1625 మంది మరణించారు. కేసులు ఎక్కువగా నమోదైనా.. మరణాలు సంఖ్య అతి తక్కువగా ఉన్న దేశంగా రష్యానే నిలవటం గమనార్హం.
ప్రాన్స్ లో పాజిటివ్ కేసులు 1.74లక్షలు నమోదైతే.. ఇప్పటివరకూ మరణాలు 25,809గా నమోదయ్యాయి. కేసులు భారీగా నమోదై.. మరణాలు తక్కువగా ఉన్న యూరప్ దేశాల్లో జర్మనీ పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పాలి. ఆ దేశంలో గురువారం వరకూ 1.68 లక్షల కేసులు నమోదైతే.. 7,322 మంది మరణించారు. టర్కీలో 1.33 లక్షల కేసులు నమోదు కాగా.. మరణాలు మాత్రం 3,641కు పరిమితమయ్యాయి. ప్రపంచంలో అత్యధిక మరణాల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది బ్రెజిల్. ఆ దేశంలో 1.27 లక్షల కేసులు నమోదు కాగా.. 8,605 మంది మరణించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తొలిదశలో పెద్ద ఎత్తున కేసులు నమోదైన ఇరాన్ లో ఇప్పటివరకూ 1.03 లక్షల మందికి సోకగా.. 6,486 మంది మరణించారు.
మొత్తంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా గురువారం అర్థరాత్రి నాటికి 38.83 లక్షల కేసులు నమోదు కాగా.. 2,68,560 మంది మరణించారు. గురువారం ఒక్కరోజులోనే 65,716 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రపంచం సంగతి ఇలా ఉంటే.. భారత్ విషయానికి వస్తే గురువారం నాటికి దేశ వ్యాప్తంగా నమోదైన కేసులు 52,952 కాగా.. గురువారం ఒక్కరోజులో 3,561 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక.. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఏపీ లో పాజిటివ్ కేసుల సంఖ్య 1833 కు చేరితే.. గురువారం ఒక్క రోజులోనే 56 కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన కొద్ది రోజులుగా కొత్త కేసుల విషయంలో తెలంగాణలో తక్కువగా నమోదవుతున్నాయని చెప్పాలి.గురువారం నాటికి ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1122కు చేరగా.. గురువారం కొత్తగా నమోదైన కేసుల 15గా ఉన్నాయి. వీటిల్లో పన్నెండు కేసులు హైదరాబాద్ మహానగరానికి చెందినవే కావటం గమనార్హం.