పాలకులు సమర్థులుగా ఉన్నప్పుడు.. ప్రజలు చైతన్యంతో పాటు.. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు సానుకూలంగా స్పందిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయనటానికి నిదర్శనంగా దేశంలోని బుల్లి రాష్ట్రాల్లో ఒకటైన గోవా నిలిచింది.
దేశంలో మరే రాష్ట్రం సాధించని ఘనతను ఈ రాష్ట్రం సొంతం చేసుకుంది. ప్రపంచాన్ని ఊపేసి.. ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనాకు చెక్ పెట్టే వ్యాక్సినేషన్ ను గోవా రాష్ట్రం వంద శాతం పూర్తి చేసింది.
మిగిలిన రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా గోవా రాష్ట్ర విజయం నిలువనుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు పూర్తి చేసి.. రెండో రౌండ్ వేస్తున్న వేళ.. గోవాలో మాత్రం అందుకు భిన్నంగా వంద శాతం వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి కావటం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి. రెండు డోసుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం వంద శాతం పూర్తి కావటంతో.. ఆ రాష్ట్రంలో టీకా సెంటర్లను మూసివేయాలని నిర్ణయించారు.
గోవాలో మొదటి డోసును 2021 సెప్టెంబరు నాటికే పూర్తైంది. వ్యాక్సిన్ కు అర్హులైన వారు రాష్ట్రంలో మత్తం 11.66 లక్షల మంది ఉన్నారు. వారందరికి రెండు డోసుల్ని తాజాగా పూర్తి చేశారు.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సవాలు విసిరేలా తుఫాన్లు.. భారీ వర్షాలు సవాలు విసిరినప్పటికీ.. ఆ అవాంతరాల్ని లెక్క చేయకుండా గోవా రాష్ట్ర ఆరోగ్య సిబ్బంది తమ లక్ష్యాన్ని పూర్తి చేసేలా పని చేశారు.
ఏమైనా గోవా సక్సెస్ స్టోరీ మిగిలిన రాష్ట్రాలకు స్ఫూర్తివంతంగా మారి.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వందశాతం వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గోవా తర్వాత వంద శాతం టీకా కార్యక్రమాన్ని పూర్తి చేసే రాష్ట్రంగా ఎవరు నిలుస్తారో చూడాలి.