పంత్​ను ధోనీతో పోల్చడం ఏమిటి? వికెట్​ కీపర్​ సాహా వ్యాఖ్యలు

Update: 2021-01-24 00:30 GMT
ఇటీవల ఆస్ట్రేలియా టెస్ట్​ సిరీస్​లో రిషబ్​ పంత్​ రాణించిన విషయం తెలిసిందే. నాలుగో టెస్ట్ లో ప్రధాన వికెట్స్ కోల్పోయి మ్యాచ్ డ్రా అయితే చాలురా దేవుడా.. అనే పరిస్థితుల్లో బ్యాటింగ్ కి వచ్చిన పంత్ చెలరేగి ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు.పంత్​కు ఇక టీం ఇండియాలో స్థానం పదిలమైనట్టేనని కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం వికెట్​ కీపర్​గా ఉన్న వృద్ధిమాన్​ సాహా పరిస్థితి ఏమిటి? అన్న విషయంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వృద్ధిమాన్​ సాహా స్పందించాడు.

‘నాకు పంత్​కు ఎటువంటి విబేధాలు లేవు. పంత్​తో నేను ఎంతో స్నేహంగా ఉంటాను. అతడు బాగా ఆడినంత మాత్రాన నా కెరీర్​కు ఢోకా ఏమీ ఉండదు. పంత్​కు నాకు మధ్య అనుబంధం ఎలా ఉంటుందో.. మీరు అతడినే అడిగి తెలుసుకోవచ్చు.ఎవరికి అవకాశం వచ్చినా మేము సహకరించుకుంటాం. నాకు గాయం కావడం వల్లే పంత్​కు అవకాశం వచ్చింది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి.

ప్రస్తుతం పంత్​ బ్యాటింగ్​లో మంచి ప్రదర్శన ఇస్తున్నాడు. కీపింగ్​లో కూడా అతడు రాణిస్తాడేమో వేచి చూడాలి’ అని సాహా పేర్కొన్నాడు.
‘అయితే చాలా మంది ఈ ఒక్క మ్యాచ్​తోనే పంత్​ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇది కరెక్ట్​ కాదు. కొంతమంది పంత్​ను ధోనీతో పోలుస్తున్నారు. ఇలా ఎందుకు పొగుడుతున్నారో అర్థం కావడం లేదు.
రహానే కెప్టెన్సీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడు చాలా కూల్​గా ఉంటాడు. జట్టులోని క్రీడాకారులందరికీ సమాన గౌరవం ఇస్తాడు. అందరినీ నమ్ముతాడు’ అని సాహా పేర్కొన్నాడు.


Tags:    

Similar News