ఫేస్ బుక్... ఇది తెలియని వారంటూ ఎవరూ ఉండరు! ప్రతి ఒక్కరి ఫోన్ లో ఉండే అప్లికేషన్స్ లో ఈ యాప్ లేకుండా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఈ ఫేస్ బుక్ అంతలా మన జీవితంలో భాగంగా మారింది. ఒకప్పుడు కనెక్టింగ్ పీపుల్ ఆన్ నెట్ అనే నినాదంతో వచ్చి ఈ యాప్ చాలా మందిని కలిపింది. ఎక్కడో ఏడు మహా సముద్రాల అవతల ఉన్న వారు కూడా వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఫ్రెండ్స్ ను ఫ్యామిలీ మెంబర్స్ ను కనుక్కుంటున్నారు. ఒక్క సారి ఈ రంగుల ప్రపంచం లోకి అడుగు పెడితే చాలు.. బయటకు ఎప్పుడు వస్తామో కూడా తెలియనంతగా దీనిలో లీనం అవతాము. ఇంతలా మన పై ప్రభావం చూపింది. ఇది అంతా బాగుంది. కానీ ఇదే ఫేస్ బుక్ తో కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయని తరువాత కొన్ని ఏళ్లకు అర్థం అయ్యింది.
మనుషులు ఫేస్ బుక్ లో దగ్గరవుతూ.. సమాజంలో దూరంగా బతుకుతున్నారు అనే విషయం చాలా మందికి బోధపడింది. కానీ దానిని ఎవరూ చూడకుండా ఉండలేరు. అయితే మనసులో మాత్రం ఆ ఫీలింగ్ అలాగే ఉంటుంది. ఎప్పుడో కొన్ని సార్లు పడుకున్న పద్మనాభ ఒక్క సరిగా మేలుకొని అరే ఛీ ఇంకా వాడకూడదు అని అనుకుంటారు. పొరపాటున ఏదైనా ఆన్ లైన్ సర్వే కనిపిస్తే దానిలో రెచ్చిపోతాడు. సరిగ్గా ఇదే జరిగింది. ఓ సర్వే ప్రకారం మన రోజూ వాడే ఫేస్ బుక్ ప్రపంచంలో ఉండే అన్నీ కంపెనీల్లో పరమ చెత్త కంపెనీ అని ఆ సర్వేలో పాల్గొన్న వారు తీర్పు ఇచ్చారు. ఇంతకీ ఆ సర్వే ఏంటి? ఆ సర్వే ఏం తేలింది? మనమూ తెలుసుకుందాం.
ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉండే అత్యుత్తమ, అతి చెత్త కంపెనీ ఏవీ అని యాహూ ఫైనాన్స్ అనే ఓ సంస్థ సర్వే నిర్వహించింది. దీనిలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఫేస్ బుక్ లాంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కంపెనీ ఈ ఏడాదికి గానూ పరమ చెత్త కంపెనీ గా నెటిజన్లు తీర్పు ఇచ్చారంట. ఇందుకు గల కారణాలను కూడా ఓటు వేసి వారు వివరించారు. ఇలా తీర్పు ఇవ్వడానికి గల ముఖ్య కారణం ఫేస్ బుక్ వినియోగదారులు వారు ఏవైతే అనుకుంటారో.. వాటిని పూర్తిస్థాయిలో అనుకున్నది అనుకున్నట్లుగా వారి భావనలను పోస్ట్ చేయలేకపోతున్నారంట.
ఈ కారణంగా మనసు నొచ్చుకొని ప్రపంచంలోనే చెత్త కంపెనీగా పదవిని కట్టబెట్టారు. ఇదిలా ఉంటే ఇటీవల పేరు మార్చుకున్నా కానీ ఫేస్ బుక్ ను మాత్రం అలానే చూస్తున్నారు అని తెలిపింది సర్వే సంస్థ. దీనికి తోడు ఫేసు బుక్ హెట్ స్పీచ్ లను కూడా ప్రమోట్ చేయడం మరొక కారణంగా చెప్తున్నారు.
ఫేస్ బుక్ తరువాత ఆ స్థానాన్ని కైవసం చేసుకున్న మరో సంస్థ చైనాకు చెందిన అలీబాబా. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన ఈ సంస్థ కూడా పరమ చెత్త కంపెనీల్లో రెండో స్థానంలో నిలిచింది. వరస్ట్ కంపెనీ ఆఫ్ ది ఇయర్ గా రెండో స్థానాన్ని మూట గట్టుకుంది. ఈ సర్వేలో సుమారు 50 శాతంకు పైగా ఓట్లు ఈ కంపెనీలకు వ్యతిరేకంగా వేసినట్లు సర్వే నిర్వాహకులు స్పష్టం చేశారు. ఇదే వరుసలో అలీ బాబా కూడా నిలవడం గమనార్హం.
యూహూ ఫైనాన్స్ అనేది ప్రతీ ఏటా ఇలాంటి సర్వేలను చేపడుతుంటుంది. అయితే ఈ సంవత్సరం కూడా అలాంటి సర్వేను మంకీ నిర్వహించింది. ఇది ఈ నెల నాలుగు, ఐదు తేదీల్లో జరిగింది. ఇందులో సుమారు1,541 మంది ఓటు వేసినట్లు నిర్వాహకులు చెప్పారు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే..? మెటా నుంచి ఉన్న మరో అప్లికేషన్ ఇన్ స్టాగ్రాం కూడా చిన్న పిల్లల మనసులపై చెడు ప్రభావాన్ని కనబరుస్తుందని పేర్కొన్నారు. మరో వైపు ఫేస్ బుక్ ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయడానికి అనుమతి ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇలా సర్వేలో పాల్గొన్న వేర్వేరు మంది వివిధ రకాలైన సమాధానాలు ఇచ్చినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.