తొలిసారి ఈ-బడ్జెట్టు ప్రవేశ పెట్టిన యనమల

Update: 2016-03-10 10:18 GMT
చంద్రబాబు నాయుడుకి హైటెక్ ముఖ్యమంత్రి అని ఎందుకు పేరొచ్చిందో... తాజా రాష్ట్ర బడ్జెట్టును ప్రవేశపెట్టిన విధానాన్ని చూస్తే అర్థం అవుతుంది. ఎందుకంటే.. మిగతా రాష్ట్రాల కంటే భిన్నంగా ఈ రోజు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈ-బడ్జెట్టును ప్రవేశపెట్టాడు. పేపర్ లెస్ విధానం అమలు చేయాలనే ఉద్దేశంతో... శాసనసభలోని సభ్యులందరికీ బడ్జెట్టు ప్రతులకు బదులుగా... బడ్జెట్టు వివరాలను తెలుగు-ఇంగ్లిష్ లలో పొందుపరిచిన ట్యాబ్ లను పంపిణీ చేశారు. దాంతో శాసనసభ్యులు ఎవరికి కవాల్సిన లాంగ్వేజ్ ను ఓపెన్ చేసుకుని బడ్జెట్టు వివరాలను తెలుసుకోవచ్చు.

సుమారు రూ.లక్షా 38 వేల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్టులో ప్రణాళికేతర వ్యయం రూ.89 వేల కోట్లకు పైగా కాగా... ప్రణాళికా వ్యయం రూ.49 వేలకోట్లు. అలాగే వ్యవసాయ బడ్జెట్టు కూడా రూ.16 వేల కోట్ల పైచిలుకే. ఈసారి తుది విడత రుణమాఫికి రైతులకు రూ.3500 కోట్లను కేటాయించింది వ్యవసాయ శాఖ. ఇప్పటికే రుణమాఫీ సరిగా జరగలేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. కనీసం ఐదు వేల కోట్లు అయినా... కేటాయించి వుంటే దీనిపై కొంతైనా విమర్శలు తగ్గేవి. చూద్దాం... బడ్జెట్టు డిస్కషన్స్ లో విపక్షం దీనిపై ఎలా స్పందిస్తుందో.
Tags:    

Similar News