రేవంత్‌ కు య‌న‌మ‌ల బంప‌రాఫ‌ర్ ఇచ్చారే

Update: 2017-10-31 04:30 GMT
తెలంగాణ టీడీపీకి ఇటీవల రాజీనామా చేసిన రేవంత్ రెడ్డికి ఏపీ ఆర్థిక మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు! తెలంగాణ‌లో తాను చేస్తున్న వ్యాపారాల‌ను రేవంత్ త‌క్ష‌ణ‌మే సొంతం చేసుకోవ‌చ్చ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. దీంతో ఒక్క‌సారిగా రేవంత్ కేంద్రంగా రాజ‌కీయం వేడెక్కింది. విషయంలోకి వెళ్తే.. వారం రోజుల కింద‌ట టీడీఎల్పీ నేత‌గా ఉన్న రేవంత్ రెడ్డి.. ఏపీ టీడీపీ నేత‌ల‌పై విరుచుకుప‌డ్డారు. తెలంగాణ‌లో తాము అక్క‌డి అధికార పార్టీ టీఆర్ ఎస్ అధినేత‌ - సీఎం కేసీఆర్‌ పై ఫైట్ చేస్తుంటే.. ఏపీలో టీడీపీ నేత‌లు మాత్రం ఆయ‌నతో చెట్టాప‌ట్టా లాడుతున్నార‌ని, భుజం భుజం రాసుకుని తిరుగుతున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. అంత‌టితో ఆగ‌కుండా  ఏపీ మంత్రి య‌న‌మల‌, ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశ‌వ్‌ ల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

య‌న‌మ‌ల సీఎం కేసీఆర్‌ తో తెర‌చాటు ఒప్పందాలు చేసుకున్నార‌ని, కాంట్రాక్టులు పొందార‌ని అన్నారు. అదేవిధంగా ప‌య్యావుల కేశ‌వ్ కూడా వ్యాపారాలు పొందార‌ని విమ‌ర్శించారు. అందుకే వీరు కేసీఆర్‌ తో భుజం భుజం రాసుకుని తిరుగుతున్నార‌ని రేవంత్ విమ‌ర్శించారు. అప్ప‌ట్లో ఈ వ్యాఖ్య‌లు తీవ్ర సంచ‌ల‌నం సృష్టించాయి. అయితే, అప్పుడు ఈ కామెంట్ల‌పై య‌న‌మ‌ల సైలెంట్ అయిపోయారు. రేవంత్‌ ను ఒక్క‌మాట కూడా అన‌లేదు. అయితే, సోమ‌వారం అమ‌రావ‌తిలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో మాత్రం త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టారు ఈ సీనియ‌ర్ నేత‌. రేవంత్‌ పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

రేవంత్ ఆరోపించినట్టు తనకు తెలంగాణలో కాంట్రాక్టులుంటే వాటిని రేవంత్‌ రెడ్డి నిరభ్యంతరంగా తీసుకోవచ్చని ఆఫర్ ఇచ్చారు. కాంట్రాక్టులపై కమీషన్లు వచ్చినా వాటినీ తీసుకోవచ్చని అన్నారు. పార్టీ నుంచి వెళ్లిపోవడానికి సాకు కోసమే రేవంత్ తనపై అటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చేమోనని యనమల అనుమానం వ్యక్తం చేశారు. త‌న‌కు కానీ, త‌న బంధువుల‌కు కానీ తెలంగాణ‌లో ఎలాంటి వ్యాపారాలూ లేవ‌ని అన్నారు. తనకు కేసీఆర్ కాంట్రాక్టులు ఇచ్చినట్టు అయితే వాటినే రేవంత్ రెడ్డి నిరభ్యంతరంగా తీసుకోవచ్చని పేర్కొన్నారు. అన‌వ‌ర‌స‌మైన వ్యాఖ్య‌ల‌తో రేవంత్ త‌మ‌పై బుర‌ద జ‌ల్లాల‌ని ప్ర‌య‌త్నించార‌ని య‌న‌మ‌ల దుయ్య‌బ‌ట్టారు. ఏదేమైనా .. య‌న‌మ‌ల బంప‌రాఫ‌ర్ అదిరిందిగా!!
Tags:    

Similar News