తాగిన మైకంలో ఆ క్రికెటర్ నన్ను అలా చేశాడు: యజ్వేంద్ర చాహల్ షాకింగ్ కామెంట్స్
సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉండే క్రికెటర్లలో యజ్వేంద్ర చాహల్ ఒకరు. ఇతడు ఎప్పుడూ ఏదో ఒకటి సోషల్ మీడియాలో పెడుతూ సందడి చేస్తూనే ఉంటాడు. ఇక పెవిలియన్ లో ఇతర క్రికెటర్లతో కలిసి కామెడీ చేస్తుంటాడు. కానీ ఒక షాకింగ్ విషయాన్ని తాజాగా బయటపెట్టి సంచలనం సృష్టించాడు. అదిప్పుడు వైరల్ గా మారింది.
తాజాగా యజ్వేంద్ర చాహల్ మాట్లాడారు.. '2013లో నేను ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్నానని.. బెంగళూరులో మ్యాచ్ ఆడిన తర్వాత హోటల్ కు చేరుకున్నామని.. నా సహచర ఆటగాడు ఒకరు బాగా తాగేసి ఆ మైకంలో నన్ను తన దగ్గరకు పిలిచి ఒక్కసారిగా నన్ను ఎత్తి పట్టుకొని బాల్కనీ నుంచి వేలాడదీశాడు.
తన చుట్టూ నేను చేతులు వేసి పట్టుకొని ఉన్నాను.. ఏ మాత్రం పట్టు కోల్పోయినా 15వ అంతస్తు నుంచి కిందపడిపోయేవాడినే.. అప్పటికే చాలా మంది అక్కడికి చేరుకున్నారు. నన్ను రక్షించారు. సృహ కోల్పోయిన నాకు నీళ్లు ఇచ్చి కుదుటపడేలా చేశారు' అని ఈ టీమిండియా ఆటగాడు చెప్పుకొచ్చాడు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవం గురించి వాపోయాడు.
తాను ఈ అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డానని.. తనకు అదొక పునర్జన్మ లాంటిదని పేర్కొన్నారు. దయచేసి అందరూ జాగ్రత్తగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశాడు. తనకు ఆ పరిస్థితి కల్పించిన క్రికెటర్ ఎవరన్న విషయాన్ని మాత్రం చాహల్ బయటపెట్టలేదు.
సహచర ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, కరుణ్ నాయర్ తో కలిసి తన జీవితంలో జరిగిన దుర్ఘటనను, అందులోంచి బయటపడిన తీరును వివరించాడు. బయటకు వెళ్లినప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని లేని పక్షంలో ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుందని చాహల్ చెప్పుకొచ్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియోను రాజస్తాన్ రాయల్స్ తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. కాగా 2013 తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోకి వచ్చిన చాహల్ చాలా కాలం పాటు ఆ ఫ్రాంఛైజీతోనే కొనసాగాడు. మెగావేలం 2022లో రాజస్థాన్ కొనడంతో ఆ టీం తరుఫున ప్రస్తుతం ఆడుతున్నాడు.

Royals’ comeback stories ke saath, aapke agle 7 minutes hum #SambhaalLenge