వైసీపీ కౌన్సిలర్ నోట షాకింగ్ మాట.. ఎన్నికల్లో గెలుపు కోసం రూ.2.5కోట్లు ఖర్చు చేశా
షాకింగ్ నిజం ఒకటి వైసీపీ కౌన్సిలర్ నోటి నుంచి అనుకోని విధంగా బయటకు వచ్చింది. ఎన్నికల్లో గెలుపు కోసం పెట్టే ఖర్చు ఎంత భారీగా పెరిగిందన్న విషయాన్ని కళ్లకు కట్టేలా మారిన ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఏలూరు జిల్లా జంగారెరడ్డి గూడెంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం వింటే.. షాకింగ్ అనిపించకమానదు. మంగళవారం పురపాలక సంఘ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అవినీతి మొదలైన చర్చ అక్కడితో ఆగకుండా.. ఎక్కడెక్కడికో వెళ్లింది. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి మరీ గెలిచామని.. అలాంటిది పదవిలోకి వచ్చిన తర్వాత వార్డుల్లో పనులు మంజూరు చేయకపోతే ఎలా? అంటూ ప్రశ్నించారు వైసీపీ కౌన్సిలర్ కాసర తులసి.
తాను ఎన్నికల్లో గెలవటం కోసం భారీగా ఖర్చు చేసినట్లుగా ఆమె పేర్కొన్నారు. 'ఎన్నికల్లో గెలుపు కోసం రూ.2.5 కోట్లు ఖర్చు చేశా. వార్డుల్లో డెవలప్ మెంట్ పనుల కోసం అడుక్కోవాలా?' అంటూ చైర్ పర్సన్ మీద ఆగ్రహం వ్యక్తం చేసిన వైనం అవాక్కు అయ్యేలా చేసింది.
జంగారెడ్డి పురపాలక సంఘం సమావేశంలో చోటు చేసుకున్న ఈ పరిణామం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి పవర్లోకి వచ్చినప్పటికీ.. వార్డుల్లో పనులు మంజూరు చేయరా? అంటూ ఫైర్ అయ్యారు.
ఎజెండా పత్రాల్ని విసిరికొట్టటమే కాదు.. పనుల కోసం పదే పదే అడుక్కోవాలా? అంటూ మండిపడ్డారు. అంతేకాదు మున్సిపల్ అధికారుల అవినీతి భాగోతాన్నిఆమె ఈ సందర్భంగా బయటపెట్టారు. అధికార పార్టీ కౌన్సిలర్ నోటి నుంచి వచ్చిన ఎన్నికల ఖర్చు మాట ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.