తెలంగాణలో వైసీపీ అధ్యక్షుడిగా ఒకప్పుడు ఉన్న గట్టు శ్రీకాంత్ రెడ్డి ఎట్టకేలకు బీజేపీలో చేరిపోయాడు. ఇప్పటివరకు వైఎస్ జగన్ స్థాపించిన ‘తెలంగాణ వైసీపీ అధ్యక్షుడి’గా ఉన్న గట్టు శ్రీకాంత్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పాడు. ఏప్రిల్ 3వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ వైసీపీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన చేశారు.తన రాజీనామా లేఖను పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ కు పంపారు.
ఇదే గట్టు శ్రీకాంత్ రెడ్డి వైఎస్ షర్మిల పార్టీలో కీలకంగా పనిచేస్తారని అనుకుంటున్న సమయంలో ఆయన తీసుకున్న సంచలన నిర్ణయం నిజంగానే షర్మిలకు షాకిచ్చినట్టైంది.
గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో చేరిపోయారు. వైఎస్ఆర్ సీపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి బీజేపీలో చేరారు. గట్టు శ్రీకాంత్ రెడ్డితోపాటు హుజూర్ నగర్ కు చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు కూడా బీజేపీలో చేరారు.
బండి సంజయ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి బీజేపీలో చేరడం సంతోషకరమైన విషయం అని బండి సంజయ్ అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ డిపాజిట్ గల్లంతు అవుతుందన్నారు. తలకాయ కిందకు, కాళ్లు పైకి పెట్టినా ఈటలపై టీఆర్ఎస్ గెలవదన్నారు.