ఏపీలో చిత్రమైన రాజకీయం సాగుతోంది. మాటకు వస్తే చాలు అన్నీ చంద్రబాబే చేశారు అని బండ ఒకటి వేసేయడం వైసీపీ నేతలకు అలవాటు అయిపోయింది. సమస్య ఏదైనా ఎక్కడ ఏం జరిగినా కూడా అంతా బాబ్బే అన్నీ బాబే అంటూ కామెంట్స్ చేస్తూంటారు. నిజంగా కొన్ని విషయాలు చూస్తే తమాషాగా ఉంటాయని అంటారు.
ఏపీలో ఇపుడు ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. వరు గత మూడు నాలుగు నెలలుగా ప్రభుత్వంతో చర్చల పేరుతో తమ సమస్యలు చెప్పుకున్నారు. పలు దఫాలుగా వారితో ప్రభుత్వ పెద్దలు భేటీలు వేశారు. కొన్ని అంశాల్లో సర్కార్ తో విభేదించి వారు సమ్మె దారి పట్టారు. ఈ సందర్భంగా చలో విజయవాడ పేరిట ఉద్యోగులు భారీ ఆందోళన కూడా నిర్వహించారు. అది గ్రాండ్ సక్సెస్ అయింది.
ఇపుడు చూస్తే వైసీపీ నేతలు దాని మీద చిర్రుబుర్రులాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తూంటే చంద్రబాబు దాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు అని మంత్రి అవతి శ్రీనివాసరావు మండిపడుతున్నారు. ఆయన ఏపీకి విపక్ష నేతగా ఉండడం ప్రజలు చేసుకున్న దురదృష్టమని కూడా అన్నారు.
ప్రతీ సమస్యను రాజకీయానికి ఎలా అనువుగా మార్చుకోవాలని చంద్రబాబు చూస్తారని అవంతి అంటున్నారు. మరి రాజకీయ నాయకులు ఎవరైనా చేసేది అదే కదా. నాడు చంద్రబాబు 20 శాతం ఫిట్మెంట్ అంటే జగన్ 27 అని ఎన్నికల ముందు పాదయాత్రలో చెప్పలేదా అని టీడీపీ నుంచి వినిపిస్తున్న మాట. అంటే నాడు చంద్రబాబుకు ఉద్యోగుల మధ్య జగన్ దూరి రాజకీయం చేశారనుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు.
మరి జగన్ రాజకీయం చేస్తే ఇపుడు బాబు కూడా అదే చేస్తారు. అయినా పరిస్థితిని అంతదాకా తెచ్చుకున్న పాపం అయితే కచ్చితంగా ప్రభుత్వ పెద్దలదే అని అంతా అంటున్నారు. నిజానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఉద్యోగులలో అత్యధికులు కోరుకున్నారు. తమ ప్రభుత్వమని వారు భావించారు. పీయార్సీ విషయంలో వారు రెండేళ్ల పాటు ఓపిక పట్టారు కూడా.
ఇక ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని అర్ధరాత్రి జీవోలు జారీ చేయడం, హెచ్ ఆర్ ఏలలో కోత పెట్టడం, 27 శాతం ఐర్ ఆర్ విషయంలో రికవరీ అని చెప్పడం ఇలా సమస్యను జఠిలం చేసుకున్నది ఎవరని టీడీపీ నేతలు అంటే తప్పేముంది. ఇక చంద్రబాబు రాజకీయం చేశారు అన్నదే నిజమనుకుంటే ఉద్యోగులను రోడ్ల మీద రానీయడమే అన్నది వైసీపీ ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పిదం కాదా అని కూడా అంటున్నారు.
మొత్తానికి వైసీపీకి చంద్రబాబు ఫీవర్ పట్టుకుంది అని తమ్ముళ్ళు సెటైర్లు వేస్తున్నారు. అవంతితో పాటు వైసీపీ నేతలు అంతా ఉద్యోగుల విషయంలో రాజకీయాలు కోరి మరీ తెస్తూ ఆ నిందను టీడీపీ మీదకు నెడుతున్నారని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు ఉన్నరు. పెన్షనర్లు నాలుగైదు లక్షల మది ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగుల బలం ఉంటే అదంతా చంద్రబాబు రాజకీయమని వైసీపీ తప్పుడు వ్యూహంతో ఆలోచించడమే ముప్పు అంటున్నారు.