వైసీపీలో భారీ నిర‌స‌న‌లు... ఇంత మంది నేత‌లు ర‌గులుతున్నారా..!

Update: 2022-12-31 00:30 GMT
``అన్న‌కు ఓటేయండి.. అన్న‌ను అధికారంలోకి తీసుకువ‌ద్దాం!`` అని 2019 ఎన్నిక‌ల‌కు ముందు చెప్పిన గొంతులు ఇప్పుడు త‌డారిపోయాయి. పోతున్నాయి. ఇప్పుడు వారు ఏమీ చెప్ప‌డం లేదు. జ‌గ‌న్ కోసం.. ఒక‌ప్పుడు చెప్పులు కూడా అరిగిపోయేలా ప‌నిచేసిన నాయ‌కులు ఇప్పుడు.. ఇళ్లకే ప‌రిమితం అవుతున్నా రు. మ‌రికొంద‌రు.. బాహాటంగానే తమ నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇంకొంద‌రు.. ఏం చేస్తారు? ఇంత‌క‌న్నా? ఇప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది! అని వ్యాఖ్య‌నిస్తు న్నారు. స‌రే.. ఇదంతా కూడా ఎవ‌రి గురించి అంటారా? ఏపీలో వైసీపీ నాయ‌కుల గురించే. ఒక్కొక్క జిల్లాల్లో క‌నీసం ఇద్ద‌రు నుంచి ముగ్గురు చొప్పన తీవ్ర అసంతృప్తితో నాయ‌కులు ర‌గిలిపోతున్నారు. ఇలా లెక్క‌లేసుకుంటే.. మొత్తంగా 26 జిల్లాల్లో ఎంత‌లేద‌న్నా.. 50 మంది నాయ‌కులుక‌నిపిస్తున్నారు.

ఉమ్మ‌డి కృష్ణాను తీసుకుంటే.. జ‌గ్గ‌య్య‌పేట ఎమ్మెల్యే ఉద‌య‌భాను, గుంటూరులో మాచ‌ర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, నెల్లూరులో కోటంరెడ్డి, ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, మానుగుంట మ‌హీధ‌ర్‌రెడ్డి, గుంటూరులో ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే మేక‌తోటి సుచ‌రిత‌, తాడికొండ ఉండ‌వ‌ల్లి శ్రీదేవి, క‌ర్నూలు ఎస్‌వీ మోహ‌న్‌రెడ్డి (మాజీ ఎమ్మెల్యే), రాజంపేట మేడా మ‌ల్లికార్జున రెడ్డి, రాయ‌చోటి శ్రీకాంత్‌రెడ్డి, గిద్ద‌లూరు అన్నా రాంబాబు, బాప‌ట్ల కోన శ‌శిధ‌ర్‌, శ్రీకాకుళం కిల్లి కృపారాణి, పేరాడ తిల‌క్‌.. ఇలా.. కీల‌క నేత‌లు అసంతృప్తితో ర‌గిలిపోతున్నారు.

వీరంతా కూడా ఒక‌రిద్ద‌రు మిన‌హా అంద‌రూ కూడా సీఎం జ‌గ‌న్ కోసం ప‌రిత‌పించిన వారే. ఆయ‌న కోసం.. అప్పులు చేసి మ‌రీ ఖ‌ర్చు చేసిన వారే. అయితే..ఇప్పుడు వీరికిప్రాధాన్యం లేకుండా పోవ‌డం.. జూనియ‌ర్ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌డం.. వారు ఆధిప‌త్య ధోర‌ణితో ముందుకు సాగ‌డం వంటివి ఇప్పుడు వారికి మ‌నోవేద‌న‌ను క‌లిగిస్తున్నాయి. దీనికి తోడు.. నియోజ‌క‌వ‌ర్గాల్లో అభివృద్ధిలేక పోవ‌డం కూడా.. వారిని తీవ్ర సంక‌ట స్థితికి చేర్చింది. దీంతో ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న‌లు పెరుగుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News