అందరూ ఊహించినట్లే పెండింగ్ లో ఉన్న మున్సిపల్, పంచాయతి ఎన్నికల్లో వైసీపీ మోజార్టీ చోట్ల విజయం సాధించింది. ముందుగానే ఆ పార్టీ ప్రకటించినట్లు కుప్పం మున్సిపాలిటీని వైసీపీ ఎగరేసుకు పోయింది. మొత్తం 25 వార్డులకుగాను ఏకగ్రీవమైన 14వ వార్డు పోగా, మిగిలిన 24 వార్డుల్లో 18 వైసీపీ స్థానాల్లో గెలిచి ఛైర్మన్ పీఠాన్ని వైసీపీ వశం చేసుకుంది. అటు పంచాయతీలు, ఎంపీటీసీలు, ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీలో కూడా అధికార పార్టీయే తిష్ఠవేసింది. అలాగని వైసీపీ భుజాలు చరుచుకోవాల్సిన పనిలేదు. టీడీపీ కుంగిపోవాల్సిన అవసరమూ లేదు. రెండు పార్టీల్లో పోస్టుమార్టం జరగాల్సిన తరుణమిది.
ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకే ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. తిరుపతి ఉప ఎన్నిక, ఆ తర్వా త వచ్చి న బద్వేలు ఉప ఎన్నికలో వైసీపీ గెలిచింది. అంతకుముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీ హవా కొనసాగింది.
2019 ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ రెండున్నర ఏళ్లలో ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత రాలేదు. అందుకు ఉదాహరణే ప్రస్తుత ఎన్నికల ఫలితాలు. అయితే వైసీపీ గెలుపుకన్నా.. ఓడిపోయిన స్థానాలు.. గట్టి పోటీ ఇచ్చిన స్థానాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక రకంగా ప్రస్తుత ఎన్నికల్లో వైసీపీ జనాలు ఓ సిగ్నల్ ఇచ్చారు. ఆ పార్టీ పునరాలోచించకుండా అలాగే ఉంటే నష్టపోయేది వైసీపీనే.
కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల ఎదురుదెబ్బలు తగిలాయి. ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ ఆధిక్యత కనపర్చింది. ఇక కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట, కొండపల్లి ఈ రెండు చోట్ల టీడీపీ, వైసీపీ పోటాపోటీగా తలపడ్డాయి. కొండపల్లిలో గెలిచిన టీడీపీ రెబల్ అభ్యర్థి, టీడీపీకే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
15 వార్డుల్లో టీడీపీ, 14 వార్డుల్లో వైసీపీ నిలిచింది. అన్ని అనుకున్నట్లు జరిగితే దర్శి లాగే, కొండపల్లి కూడా టీడీపీ ఖాతాలో చేరుతుంది. గుంటూరులో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఈ ఫలితాలను చూస్తే టీడీపీ ఈ బెల్ట్ లో కాస్త పుంజుకున్నట్లు అర్థమవుతోంది.
ఇక్కడ వైసీపీ ఏకపక్షం కాకుండా టీడీపీ అడ్డుకుంది. మొత్తంగా పరిశీలిస్తే వైసీపీకి ఆధిక్యం వచ్చిన మాట నిజం. ఇప్పటికి రాష్ట్రంలో వైసీపీకి రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆ పార్టీకి ఆధిక్యత కూడా ఉంది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో గెలుపు కోసం టీడీపీ సర్వ శక్తుల వడ్డింది. అన్ని పరిస్థితులు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ పలితాలు ఏకపక్షం కాకుండా టీడీపీ అడ్డుకుంది.
మొత్తంగా ఈ ఎన్నికలను పరిశీలిస్తే వైసీపీకి ఇంకా ఆధిక్యత ఉన్నట్లు అర్ధమవుతోంది. టీడీపీ ప్రజా సమస్యలపై పోరాడగలిగితే ఫలితాలెప్పుడూ ఏక పక్షంగా ఉండవని తాజా ఎన్నికలు నిరూపించాయి. ఏకపక్షంగా రాజకీయాలుంటాయని, ఇక టీడీపీ పని అయిపోయిందని వైసీపీ అనుకున్నా.. ఇప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ ఓడిపోతారని టీడీపీ అనుకున్నా. ఈ అభిప్రాయాలు సరైనవి కాదని ఈ ఎన్నికలు మరోసారి నిరూపించాయి.