వైసీపీ మేనిఫెస్టోనే తమకు భగవద్ఘీత, ఖురాన్,బైబిల్ లాంటిందని.. మేనిఫెస్టో కాపీలను అందుకే సెక్రెటేరియట్, కలెక్టర్ కార్యాలయాల్లో ఉంచామని ఏపీ సీఎం జగన్ తెలిపారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడారు. సీఎంగా తాను ప్రమాణం చేసిన ప్రకారం రాష్ట్రాన్ని పాలిస్తున్నానని తెలిపారు. దేవుడి మీద ప్రమాణం చేసిన తాను ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతున్నానని వివరించారు. మేనిఫెస్టోలోని 90శాతం హామీలను అమలు చేశామని తెలిపారు.
ఐదేళ్ల కాలానికి మేనిఫెస్టోను ప్రకటించామని.. వాటిలో చాలా వరకు మొదటి సంవత్సరం లోనే అమలు చేశామని జగన్ చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మొత్తం 129 వాగ్ధానాల్లో 77 వాగ్దానాలు నెరవేరాయని.. మరో 36 వాగ్ధానాలు త్వరలో అమలు చేయబడుతాయని సీఎం జగన్ తెలిపారు. మిగిలిన 16 హామీల అమలుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 90శాతం హామీలు ఇప్పుడు అమలు చేయబడుతున్నాయని ఆయన అన్నారు.
జగన్ పాలనలో ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శకంగా పాలన సాగుతోందని అన్నారు. ఇప్పటివరకు ప్రజల సంక్షేమం కోసమే 40వేల కోట్లు ఖర్చు చేశామని జగన్ తెలిపారు.