పొలిటికల్ ఫైర్ బ్రాండ్, మంత్రి ఆర్కే రోజా గళం విప్పితే.. ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. టీవీల్లో ఆమె నిర్వహించే ప్రెస్‌మీట్లు జోరుగా వైరల్ అవుతుంటాయి. విమర్శలు చేయడం.. హాట్ కామెంట్లు కుమ్మరించడంలో ఆమెను మించిన నాయకురాలు లేరం టే అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలపై ఆమె చేసే కామెంట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక, ఎన్నిక లసమయంలో అయితే.. రోజా చేసే వ్యాఖ్యలు.. వేసే పంచ్‌లకు పార్టీ నేతలు ఫిదా అవుతుంటారు. అందుకే .. రోజా కు ఫాలోయింగ్ ఎక్కువ. అయితే.. ఎ వరూ ఊహించని విధంగా.. తాజాగా ఆమెకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికలో.. వైసీపీ తరఫున దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తమ్ముడు మేకపాటి విక్రమ్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ ఆయనను గెలిపించుకునేందుకు, కాదు.. కాదు.. భారీ మెజారిటీ దక్కించుకునేందుకు వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారు.
మండలాల వారీగా.. మంత్రులు ప్రచార బాధ్యతలను తలకెత్తుకున్నారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రులు వరుస పెట్టి.. ప్రచారం దంచికొడుతున్నారు. ఈ క్రమంలో రోజా కూడా విక్రమ్ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో.. రోజా వస్తుందని వైసీపీ నాయకులు ముందే ప్రచారం చేశారు.
ఇంకేముంది.. భారీ ఎత్తున జనాలు వస్తారని.. రోజా మీటింగ్ అదిరిపోతుందని అందరూ లెక్కలు వేసుకున్నారు. అయితే.. అనూహ్యంగా రోజాకు చుక్కెదురైంది. వైసీపీ తరుపున రోజా ఎన్నికల ప్రచారానికి వెళ్లగా... జనం కనిపించలేదు. ఇక, ఆమె ఎంతో ఆర్భాటంగా చేసిన రోడ్ షోలు కూడా వెలవెలబోయాయి. దీంతో రోజా వెంట ఉన్న వైసీపీ నాయకులు ఒకింత గాబరా పడ్డారు.
కానీ, రోజా మాత్రం మైకు ముందుంటే.. చాలు అనుకున్నారో ఏమో.. ప్రజలు లేకపోయినా ప్రసంగాన్ని దంచి కొట్టారు. అయితే.. ఇలా చేస్తే బాగోదని.. ప్రత్యర్తులు ప్రచారం చేసుకుంటారని.. భావించారో ఏమో.. మరికొన్ని చోట్ల జనం లేకపోవడంతో ప్రసంగించకుండానే వెళ్లిపోయారు.
మొత్తానికి రోజా పాల్గొన్న సభలు వెలవెల బోవడం.. వైసీపీలోనే చర్చకు దారితీసింది. ఇలా ఎందుకు జరిగింది? అనే అంశంపై నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇక్కడ ప్రచారం చేసిన సమయంలో నూ ఇదే పరిస్థితి నెలకొంది. అంతేకాదు.. స్థానికంగా.. ఉన్న కొందరు వైసీపీ నేతలకు ఆయన తెలియకపోవడంతో కీలక నేతలు.. ఆయనను పరిచయం చేయాల్సి వచ్చింది. దీంతో మాకే ముఖ పరిచయం లేదు.. ఇక, ప్రజలకు ఆయన ప్రసంగాలు ఏమెక్కుతాయి? అనే సందేహాలు తెరమీదికి వచ్చాయి. ఇదీ.. ఇప్పుడు ఆత్మకూరు పరిస్తితి.