ఏపీలో రాజకీయం రోజురోజుకీ రసకందాయంలో పడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ అధికారపక్షం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు విపక్ష నేతలు ఒక్కొక్కరుగా వస్తూ సైకిల్ ఎక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత జ్యోతుల నెహ్రు ఎపిసోడ్ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కేస్తారన్న వాదన జోరందుకుంది. దీనికి తగ్గట్లే జ్యోతుల నెహ్రు బంధువు వరువుల సుబ్బారావు తాను తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించటం.. మంత్రి యనమలతో జ్యోతుల నెహ్రు భేటీ కావటం లాంటి పరిణామాలతో తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్ కాంగ్రస్ ఎమ్మెల్యేలు మొత్తంగా టీడీపీ తీర్థం పుచ్చుకొని జగన్ కు షాకిస్తారన్న మాట వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఇదే జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే వి. రాజేశ్వరి ఆసక్తికర ప్రకటన చేశారు. తాను తెలుగుదేశం పార్టీలోకి చేరటం లేదని ఆమె స్పష్టం చేస్తున్నారు. పార్టీ మారే ఆలోచన తనకు లేదని.. జగన్ కారణంగానే తానీ స్థాయిలో ఉన్నానని.. తాను పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నా అందులో నిజం లేదని ఆమె స్పష్టం చేస్తోంది. అంతేకాదు.. తాను పార్టీ మారితే రూ.20కోట్లు ఇస్తామని చెప్పారని.. ఒత్తిడి కూడా చేశారంటూ ఆమె ఆరోపిస్తున్నారు. డబ్బు కోసం పార్టీ మారే ఆలోచన లేదని ఆమె తేల్చి చెబుతున్నారు. రాజేశ్వరి ఆరోపణ మీద ఏపీ అధికారపక్ష నేతలు ఎలా రియాక్ట్ అవుతారో..