బుక్కైన చిన్నరాజప్ప.. ఎమ్మెల్యే పోస్టు ఊస్టేనా?

Update: 2019-07-07 06:19 GMT
ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులందరూ తమపై నమోదైన కేసులన్నింటిని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనాలి. లేకపోతే ఆ తర్వాత ఎవరైనా ఫిర్యాదు చేస్తే అనర్హత వేటు వేస్తారు. ఈసీ నిబంధనలు ఉల్లంఘించిన చాలా మంది ఎమ్మెల్యే పోస్టును పోగొట్టుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ముగింపు వేళ ఏడు ఎనిమిది నెలల క్రితం అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఇలాంటి కేసుల వ్యవహారంలోనే అనర్హత వేటు పడి పోస్టు ఊస్ట్ అయ్యింది. ఆయనపై ఓడిపోయిన వైసీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి చివరి ఆరునెలలు కొనసాగారు.

ఇప్పుడా ఆ ముప్పు టీడీపీ సీనియర్ నేత - మాజీ హోమంత్రి చిన్న రాజప్పకు ఉంది. ఆయన మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి గెలిచారు. టీడీపీ నుంచి గెలిచిన అతికొద్దిమంది ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు. అయితే ఇప్పుడు ఆయన ఎన్నికల్లో పోటీ వేళ అఫిడవిట్ లో తనపై నమోదైన క్రిమినల్ కేసులను దాచేశారు.వైఎస్ హయాంలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీపై టీడీపీ నాయకులు నాగం జనార్ధన్ రెడ్డి హయంలో దాడి చేశారు. ఈ దాడిలో చిన్న రాజప్ప కూడా ఉన్నారు. అప్పుడు ఆయనపై క్రిమినల్ కేసులు దాఖలయ్యాయి. ఇప్పుడు వాటిని దాచి ఆయన ఎన్నికల్లో పోటీచేశారు.

 వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఆ కేసులన్నింటిని సేకరించారో.? లేక ఎలా సంపాదించారో కానీ ఆయనపై ఓడిన వైసీపీ అభ్యర్థిని తోట వాణి ఇప్పుడు కోర్టుకెక్కారు., చిన్నరాజప్ప ఎన్నిక చెల్లదంటూ పిటీషన్ దాఖలు చేశారు. ఆయనపై నమోదైన కేసులు పేర్కొనలేదని కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో చిన్నరాజప్ప పై కోర్టు అనర్హత వేటు వేయడం .. ఆయన ఎమ్మెల్యే పదవి కోల్పోవడం ఖాయమన్న అంచనాలు ఏర్పడుతున్నాయి.


Tags:    

Similar News