ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవానే ఉండబోతోందనే విశ్లేషణల నేపథ్యంలో ఇన్ని రోజులూ చంద్రబాబు నాయుడు భజన చేసిన మీడియా వర్గాల్లో కూడా దడపుడుతోందని సమాచారం. ఇన్ని రోజులూ చంద్రబాబుకు జాకీలు వేసి పైకి లేపుతూ.. జగన్ మీద బుదర జల్లడానికి కూడా వెనుకాడలేదు కొన్ని మీడియా వర్గాలు.
అలాంటి మీడియా వర్గాలకే ఇప్పుడు అధిక ఆందోళన కనిపిస్తూ ఉంది. జగన్ మోహన్ రెడ్డి అధికారాన్ని చేపట్టే అవకాశం ఉండటంతో ఆ మీడియా వర్గాలు అప్పుడే ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా సమాచారం.
అందులో భాగంగా రెండు మీడియా వర్గాల వారు జగన్ తో సమావేశం కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారట. ఇన్ని రోజులూ ఏదో జరిగిపోయింది అని వివరణ ఇచ్చుకోవడానికి ఫలితాలకు ముందే జగన్ ముందు సాగిల పడటానికి సదరు పచ్చ మీడియా వర్గాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయట.
ఇన్ని రోజులూ ఆ రెండు చానళ్లూ పూర్తిగా తెలుగుదేశం భజనే చేశాయి. అలాగే జగన్ మీద విష ప్రచారాలకు కూడా అవి వెనుకాడలేదు. ఇప్పుడు జగన్ అధికారంలోకి రానున్నాడనే లెక్కలతో వాటి యాజమాన్యాలు జగన్ తో సమావేశం అయ్యి.. తమ సపోర్ట్ ను ప్రకటించడానికి రెడీ అంటున్నాయట. మరి ఇన్ని రోజులూ జగన్ మీద అకారణంగానే విష ప్రచారాన్ని చేసిన వారిని జగన్ ఎలా ట్రీట్ చేస్తారో చూడాలి!