యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతికి బాలీవుడ్ లో బంధుప్రీతి.. అతనికి ఎదురైన అవమానాలే కారణమని స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మొదటి నుంచీ ఆరోపిస్తూ వస్తోంది. అయితే కేసు విచారణకు సంబంధించి ముంబై పోలీసులపై నమ్మకం లేదని.. మాఫియా కంటే ముంబై పోలీసులంటేనే ఎక్కువ భయం ఉందని వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. అయితే దీనిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించి ముంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ఇక్కడ అడుగుపెట్టవద్దని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో శివసేన సంజయ్ రౌత్ - బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మధ్య మాటల యుద్ధం స్టార్ట్ అయింది. ఇక కంగనా సంజయ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ శివసేన ఎంపీ తనను బహిరంగంగా బెదిరిస్తున్నారని.. ముంబై నగరం తనకిప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లా కనిపిస్తోందని ట్వీట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. కంగనా ని ముంబైలో అడుగుపెట్టవద్దని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.
దీనికి కంగనా తీవ్రంగా స్పందిస్తూ 'ఈ నెల 9న ముంబై వస్తున్నానని దమ్ముంటే తనను ఆపాలని మరో ట్వీట్ తో విమర్శకులపై విరుచుకుపడ్డారు. దీనిపై మీడియాతో మాట్లాడిన ఎంపీ సంజయ్ కంగనాకు పిచ్చి పట్టిందని.. 'హరామ్ కోర్ లడ్కీ' అంటూ వ్యాఖ్యానించడంతో వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీనిపైనా కంగనా తీవ్ర స్థాయిలో స్పందిస్తూ.. ''నేను ముంబై పోలీసులను మిమ్మల్ని మాత్రమే విమర్శించాను.. మహారాష్ట్ర ను కాదు. మీరే నేను మహారాష్ట్రని అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మీ వ్యక్తులు నన్ను బెదిరిస్తున్నారు. ఈ నెల 9న ముంబై వస్తున్నాను. అక్కడ కొట్టినా.. చంపినా సరే'' అని ట్విట్టర్ లో ఓ వీడియో విడుదల చేసింది.
మరోవైపు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ 'మహారాష్ట్రను కించపరిస్తే సహించేది లేదని.. మహారాష్ట్ర, ముంబై, మరాఠాలు.. ఈ మూడింటిపై మితిమీరి మాట్లాడొద్దని.. ఇక్కడ పుట్టి పెరిగినవారైనా బయటివారైనా నీడనిచ్చిన ప్రాంతంపై నోరు పారేసుకోవద్దని' అన్నారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) పోల్చిన కంగనా రనౌత్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కంగనా ట్వీట్లపై స్పందించే క్రమంలో తానేమైనా తప్పుగా మాట్లాడితే క్షమాపణలు కోరడానికి సిద్ధమని సంజయ్ ప్రకటించారు.