తాళి క‌ట్టే అన్న‌ను ఆ త‌మ్ముడ‌లా చేశాడు

Update: 2017-06-02 08:41 GMT
త‌మిళ‌నాడులోని వేలూరుకు స‌మీపంలో చోటు చేసుకున్న ఒక ఉదంతం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. ఈ విచిత్ర‌వైనం స్థానికంగానే కాదు.. దేశ వ్యాప్తంగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. తాళి క‌ట్టే అన్న‌ను అత‌డి సొంత త‌మ్ముడు తోసేసి.. తాను తాళి క‌ట్టిన వైనం.. దానికి దారి తీసిన ప‌రిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

వేలూరు జిల్లాలోని తిరుప‌త్తూరు సెల్ల‌రైప‌ట్టికి చెందిన కామ‌రాజ్‌ కు ముగ్గురు కొడుకులు. వారిలో రెండో కొడుకు పేరు రాజేష్‌.. మూడో కొడుకు పేరు వినోద్‌. ఆర్నెల్ల కింద‌ట రాజేశ్‌కు మ‌ధురైకి చెందిన ఒక యువ‌తితో వివాహం ప‌క్కా అయ్యింది. ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది.

పెళ్లిపీట‌ల మీద కూర్చున్న వ‌రుడు.. పంతులుగారు ఇచ్చిన తాళిని తీసుకొని.. వ‌ధువు మెడ‌లో క‌ట్టే లోపు.. ఊహించ‌ని రీతిలో అన్న‌ను తోసేసిన వినోద్‌.. వ‌ధువు మెడ‌లో తాళి క‌ట్టేశాడు. ఒక్క‌సారిగా చోటు చేసుకున్న ఈ పరిణామం అక్క‌డి వారికి షాకిచ్చింది.

దీంతో.. ఇరు వ‌ర్గాల‌కు చెందిన త‌ల్లిదండ్రులు.. బంధువులు వినోద్‌ను చిత‌క్కొట్టేశారు. ఎందుకీ పాడు ప‌ని చేశావంటూ నిల‌దీయ‌గా.. అస‌లు విషయం బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌న అన్న‌కు పెళ్లిచూపుల స‌మ‌యంలోనే పెళ్లి కుమార్తెకు న‌చ్చాన‌ని.. త‌న‌కు ఆమె న‌చ్చింద‌ని.. కానీ ఆ విష‌యం చెప్ప‌లేక‌పోయాన‌ని.. పెళ్లి వేళ‌లో ఇక ఉండ‌లేక తానీ ప‌ని చేసిన‌ట్లుగా చెప్పారు. వినోద్ చేసిన ప‌నికి పెళ్లికుమార్తె ఆమోదం ఉంద‌ని తెలీటంతో మిగిలిన వారంతా ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. తామిద్దరం ప్రేమించుకున్నామ‌ని చెప్ప‌టంతో వ‌రుడు రాజేశ్ క‌న్నీటి ప‌ర్యంత‌మై పెళ్లి వేదిక నుంచి వెళ్లిపోయాడు. అయినా.. పిచ్చి కాక‌పోతే.. నిజంగా అంత ప్రేమే ఉంటే..  ఆఖ‌రి నిమిషం వ‌ర‌కూ ఆగే బ‌దులు.. ముందే పెద్ద‌ల‌కు చెప్పేసి ఉంటే ఇంత లొల్లి జ‌రిగి ఉండేది కాదేమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News