అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా.. మోడీ సర్కారు మీద ఉన్న ఆగ్రహాన్ని ఒక మూగ జీవంపై ప్రదర్శించిన వైనం ఇప్పుడు వివాదాస్పదం కావటమే కాదు సంచలనంగా మారింది. ఆవుల అమ్మకాలపై ఆంక్షలకు నిరసనగా కేరళ యువ కాంగ్రెస్ కార్యకర్తలు దారుణానికి పాల్పడ్డారు. ఆవులతో సహా.. పలు జంతువుల క్రయ విక్రయాలపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ను శుక్రవారం విడుదల చేసింది కేంద్రం.
దీనికి నిరసనగా కేరళకు చెందిన యూత్ కాంగ్రెస్ ఒక నిరసనను నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక బర్రెను బహిరంగంగా నరికేసిన వైనం ఇప్పుడా రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఆవుల అమ్మకంపై పరిమితులు విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతూ.. బాహాటంగా బర్రెను నరికేసిన వైనానికి సంబంధించిన వీడియోను కేరళ బీజేపీ అధ్యక్షుడు కుమ్మనాం రాజశేఖరన్ తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశారు.
ఈ వీడియో ఇప్పుడు పెను సంచలనంగా మారింది. సామాన్యులెవరూ ఇంతటి దుర్మార్గానికి ఒడిగట్టరని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా వధించటాన్ని సీపీఎం సైతం ఖండించింది. మూర్ఖమైన నిరసనల్ని మానుకోవాలని.. ఇలాంటి చర్యలు సంఘ్ పరివార్ కే మేలు చేస్తుందని సీపీఎం ఎంపీ రాజేశ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ సైతం ఈ నిరసనను తప్పు పట్టింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం స్పందించారు. ఇలాంటి చర్యలు అనాగరికంగా పేర్కొన్న ఆయన.. నిరసనను తీవ్రంగా ఖండించారు. అందరూ అన్ని విధాలుగా తప్పు పడుతుంటే.. ఇంత దారుణంగా వ్యవహరించిన కేరళ యూత్ కాంగ్రెస్ నేతలు మాత్రం తమ చర్యల్ని సమర్థించుకోవటం విశేషం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/