మ‌ర‌ణానికి కార‌ణ‌మైన మందుగుమ్మ‌

Update: 2018-03-19 08:13 GMT
ఇద్ద‌రు అమ్మాయిలు. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌ కు వ‌చ్చారు. ఎందుకంటారా? స‌్నేహితుడ్ని క‌ల‌వ‌టం కోసం వ‌చ్చామా? స‌్నేహితుడ్ని క‌లిశామా? ఎంజాయ్ చేశామా? ఇంటికి వెళ్లిపోయామా? అన్న‌ట్లు ఉంటే.. అస‌లీ వార్త రాయాల్సి వ‌చ్ఏదే కాదు. త‌మ సంతోషం కోసం ఢిల్లీ నుంచి అమ్మాయిలు ఇద్ద‌రు స్నేహితుడ్ని క‌లిశారు. క‌లిసిన‌ప్పుడే తాగారో.. త‌ర్వాత తాగారో కానీ.. ఫుల్ గా తాగేశారు. ఆపై అద్దెకు తీసుకున్న కారుతో రోడ్డు మీద‌కు వ‌చ్చారు.

శ‌నివారం అర్థ‌రాత్రి వేళ.. ఖాళీగా ఉన్న గ‌చ్ఛిబౌలి రోడ్ల మీద కారుతో వాయు వేగంతో దూసుకెళ్లారు. అంత‌లోనే త‌మ‌కు ఎదురైన ఫుడ్ డెలివ‌రీ బాయ్ వాహ‌నాన్ని ఢీ కొట్టేశారు. దీంతో.. ఆ యువ‌కుడు మృతి చెంద‌గా.. అదే బైకు మీద ఉన్న అత‌ని స్నేహితుడి ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా మారింది.  శ‌నివారం అర్థ‌రాత్రి వేళ‌.. గచ్చిబౌలి ద‌గ్గ‌ర చోటు చేసుకున్న ఈ ప్ర‌మాదం సంచ‌ల‌నంగా మారింది.

ఈ ఉదంతంలో మ‌రింత విషాదం ఏమిటంటే.. మ‌ర‌ణించిన యువ‌కుడికి అదే రోజు ఉద్యోగం రావ‌టం. బోర‌బండ‌లో సెక్యురిటీ గార్డుగా ప‌ని చేసే శ్రీ‌నివాసులు కుమారుడు 20 ఏళ్ల చిరంజీవి. జుమాటో పుడ్ సంస్థ‌లో డెలివ‌రీ బాయ్ గా అదే రోజు ఉద్యోగంలో చేరాడు. శ‌నివారం రాత్రి 11.30 గంట‌ల స‌మ‌యంలో క‌స్ట‌మ‌ర్ కు ఆర్డ‌ర్ డెలివ‌రీ చేసేందుకు ఫ్రెండ్ తో క‌లిసి కెన‌టిక్ హోండాపై వెళుతున్నాడు. గ‌చ్చిబౌలి నుంచి టీ హ‌బ్ వ‌ద్ద‌కు చేరుకోగానే.. వెనుక నుంచి వేగంగా వ‌చ్చిన కారు గుద్దుకోవ‌టంతో బైకు మీద ప్ర‌యాణిస్తున్న చిరంజీవి.. అత‌డి స్నేహితుడు తీవ్ర‌గాయాల‌య్యాయి.

ఆసుప‌త్రిలో చేరిన ఇద్ద‌రిలో చిరంజీవి చికిత్స పొందుతూ మ‌ర‌ణించ‌గా.. అత‌డి స్నేహితుడి ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని చెబుతున్నారు. ఇక‌.. కారును న‌డుపుతున్న వారి వివ‌రాల్లోకి వెళితే..  ఆమె ఢిల్లీకి చెందిన జెన్నీ జాక‌బ్ గా గుర్తించారు.  ఆమెతో పాటు కారులో ఆమె స్నేహితురాలు లీసా ఉన్న‌ట్లుగా తేల్చారు.

హైద‌రాబాద్‌ లో ఉన్న త‌మ స్నేహితుడు నీరుల్లాను క‌లుసుకునేందుకు ఢిల్లీ నుంచి నాలుగు రోజుల క్రితం హైద‌రాబాద్ వ‌చ్చారు. అద్దె కారును తీసుకున్న వారు శ‌నివారం రాత్రి మ‌ద్యం మ‌త్తులో వేగంగా కారు న‌డుపుతూ ప్ర‌మాదానికి కార‌ణ‌మైన‌ట్లుగా భావిస్తున్నారు. కారు ఎంత బ‌లంగా బైక్ ను ఢీ కొట్టిందంటే.. ప్ర‌మాద స‌మ‌యంలో కారు బోల్తా ప‌డ‌ట‌మే కాదు.. మూడు ప‌ల్టీలు ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. కారులోని బెలూన్లు ఓపెన్ కావ‌టంతో అందులో ప్ర‌యాణిస్తున్న ఇద్ద‌రికి ఎలాంటి ప్ర‌మాదం కాలేదు. కారులో మ‌ద్యం సీసాలు.. చికెన్ ముక్క‌ల్ని పోలీసులు గుర్తించారు. ప్ర‌మాదానికి కార‌ణ‌మైన జెన్నీని అదుపులోకి తీసుకున్న పోలీసులు బెయిల్ మీద విడుద‌ల చేసిన‌ట్లుగా తెలుస్తోంది. మ‌ద్యం మ‌త్తులో వాహ‌నాలు న‌డ‌ప‌టం ద్వారా ప్రాణాలు పోయే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం ఎంత చేసినా మార్పు రాక‌పోవ‌టం గ‌మ‌నార్హం. త‌మ సుఖం కోసం.. సంతోషం కోసం వేరే వారిని బ‌లిపెట్టే ఇలాంటి వారి విష‌యంలో చ‌ట్టం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.


Tags:    

Similar News