యువ‌త‌ను త‌న‌వైపు తిప్పుకొన్న‌ట్టేనా? ప‌వ‌న్ స‌భ‌పై యూత్ టాకేంటి?

Update: 2023-01-13 11:30 GMT
జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌భ‌పై యూత్ ఏమంటున్నారు?  'యువ‌శ‌క్తి' స‌భ‌పై వారి అభిప్రాయం ఏంటి? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. ఎందుకంటే.. యువ‌శ‌క్తి పేరిట నిర్వ‌హించిన స‌భ‌లో వారికి సం బంధించిన విష‌యాల‌పై ప‌వ‌న్ ఏమేర‌కు చ‌ర్చించార‌నేది ప్ర‌శ్న‌.

వాస్త‌వానికి.. ఈ స‌భ ప్రోమోలో.. ప‌వ‌న్ ఒక కీల‌క విష‌యాన్ని పేర్కొన్నారు. అదేంటంటే.. దేశంలో యువ‌శ‌క్తి పెరిగింద‌ని.. దీనిని వినియోగించు కోవడం ద్వారా.. దేశాన్ని  ముందుకు తీసుకువెళ్లాల‌నేది త‌న ఉద్దేశ‌మ‌ని చెప్పారు.

అదేస‌మ‌యంలో రాష్ట్రంలోనూ యువ శ‌క్తి పెరిగింది. దీనిని కూడా రాష్ట్రానికి, మ‌రోవైపు దేశానికి కూడా విని యోగించేలా చేయాల‌నేది ప‌వ‌న్ ఉద్దేశంగా క‌నిపించింది. దీంతో యువ‌శ‌క్తికి సంబంధించి..ప‌వ‌న్ అద్భుత మైన ద‌శ‌, దిశ వంటివి చూపిస్తార‌ని అంద‌రూ త‌ల‌పోశారు. నిజానికి రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి యువ ఓట‌ర్ల సంఖ్య దాదాపు కోటికి పైగా ఉంటుంద‌నే అంచ‌నా ఉంది.

దీనిని దృష్టిలో పెట్టుకునే అటు టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం యువ‌త‌కు పెద్ద‌పీట వేయాల‌ని భావి స్తున్న‌ట్టు చెబుతున్నారు. ఇక‌, ప‌వ‌న్ వంటి నాయ‌కుడికి ఎలానూ అభిమానులు ఉన్నారు కాబ‌ట్టి.. వారిని త‌న‌దైన శైలిలో మ‌ల్చుకుంటార‌ని.. యువ‌శ‌క్తి స‌భ ద్వారా దిశానిర్దేశం చేస్తార‌ని అనుకున్నారు. కానీ, ప‌వ‌న్ స‌భ ఆమేర‌కు స‌క్సెస్ సాధించ‌లేద‌ని.. స‌భ‌కు వ‌చ్చిన వారు వెల్ల‌డించిన అభిప్రాయాన్ని బ‌ట్టి స్ప‌ష్ట‌మైం ది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌త పాత్ర ఏంటి?  రాజ‌కీయంగా వారు అందుకోవాల్సిన అంద‌లాలేంటి?  త‌మ పార్టీ త‌ర‌ఫున యువ‌త‌కు ప్రాధాన్యం ఎలా క‌ల్పిస్తాం.. విద్య‌, రాజ‌కీయంరెండింటిలోనూ స‌మాన ప్రాతినిథ్యం కోరుకున్న వివేకానంద స్ఫూర్తిని యువ‌త‌లో ఎలా పెంపొందిస్తాం అనే మాట  ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేక పోయారు.

అంతేకాదు.. అస‌లు వివేకానందుని మాటే ఎత్త‌కుండా.. ఆసాంతం రాజ‌కీయ స‌భ‌గా గ‌డిచిపోయింద‌ని యువ‌త వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. ప‌వ‌న్ స‌భ అన‌గానే నాలుగు చ‌ప్ప‌ట్లు.. మ‌రో నాలుగు ఈల‌లు.. కామ‌న్‌. ఇవే ఈ యువ శ‌క్తి స‌భ‌లోనూ క‌నిపించాయ‌ని అంటున్నారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News