మిగతా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నా తెలంగాణ ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉంది. మిగతా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ ఓటర్లలో విద్యావంతులు ఎక్కువ. దీంతో ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ జిమ్మిక్కుల ఆధారంగా కాకుండా ఓటర్ల విచక్షణ మేరకు వెలువడనున్నాయి. యువతను మెప్పించిన వారే ఎన్నికయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.
ప్రస్తుతం ఎన్నికల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే... ఇపుడు మాకు ఓటు వేయండి అని అడుగుతున్న అన్ని పార్టీల పాలన ప్రజలు చూశారు. ఎవరి సమర్థత ఎంతో వారికి తెలుసు. పైగా పాత తప్పదాలు - కొత్త తప్పిదాలు అన్నీ సోషల్ మీడియా పుణ్యమా అని ప్రజలకు తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు చెప్పే మాటల ఆధారంగా ఎవరూ వారిని నమ్మడం లేదు. సొంతంగా విశ్లేషించుకుని ఈసారి ఓటు వేయనున్నారు. దీంతో అన్ని పార్టీల్లోనూ ఒక భయం నెలకొంది. అసలు ఫలితాలు అస్సలు గెస్ చేసే పరిస్థితి కనిపించడం లేదు.
ఉదాహరణకు విద్యార్థులనే తీసుకుంటే విద్య - ఉద్యోగ అవకాశాల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మాకు ఓటేస్తే అద్భుతంగా ఆదరిస్తాం - ఉద్యోగాలు ఇస్తాం అంటున్నారు. అయితే, మీరు అలాంటి వారే అయితే అంతకుముందు మీరే ఉన్నారు కదా అపుడు ఎందుకు ఇవన్నీ చేయలేదు అని ప్రజలు అడిగే పరిస్థితి ఉంది. పైగా యువత తమ మాట వినే నేతలు ఎవరు? ఎన్నికల తర్వాత వారు ఎలా వ్యవహరిస్తారు అని ఆలోచించే ఓటు వేయనున్నారు. అందుబాటులో ఉండే నేతలనే ఎంచుకోనున్నారు. తమను అర్థం చేసుకుని - తమకు కనెక్టయ్యే వారినే గెలిపించుకునే అవకాశం ఉంది. అందుకే కేసీఆర్ ఎంత సమర్థుడైనా... ఎందుకయినా మంచిదని తన కుమారుడు కేటీఆర్ ను ముందు పెడుతున్నారు. నిజానికి గతంలో ఏ తెలంగాణ నేతతో పోల్చినా కేటీఆర్ కు నేటి యువతతో ఉన్నంత ప్రత్యక్ష సంబంధాలు ఎవరితోనూ లేవు.
ఇంకో విషయం ఏంటంటే... పార్టీలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఈసారి అభ్యర్థిని బేస్ చేసుకుని ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అభ్యర్థి నిజాయితీని గుర్తించి తమ సత్తా చాటేందుకు యువత సిద్ధమవుతున్నదని ట్రెండ్ చూస్తే అర్థమవుతోంది. ఏదేమైనా ఈసారి సోషల్ మీడియా గాని - యువతరం గాని... నేతలకు చెమటలు పట్టిస్తోంది. మరి వారేం డిసైడ్ చేస్తారో చూద్దాం.