ర‌క్త‌పు కూడు అసలే వ‌ద్దంటున్న జ‌గ‌న్‌

Update: 2017-07-10 04:30 GMT
ప్ర‌జ‌ల‌కు అది చేస్తాం.. ఇది చేస్తామ‌ని చెప్పే నేత‌లు పాల‌కులుగా మారిన త‌ర్వాత‌.. ప్ర‌జ‌ల ర‌క్తాన్ని పీల్చేలా..వారి బ‌ల‌హీన‌త‌ల్ని సొమ్ము చేసుకునేలా వ్య‌వ‌హ‌రించ‌టం మామూలే. కాసులు కురిపించే ఎక్సైజ్ శాఖ‌ను మ‌రింత బ‌లోపేతం చేయ‌టం.. ప్ర‌తి సందులోనూ లిక్క‌ర్ షాపుల‌కు అనుమ‌తి ఇచ్చేలా నిర్ణయాలు తీసుకోవ‌టం బాబు స‌ర్కారులో క‌నిపిస్తుంది. ప్ర‌జ‌ల‌కు మ‌ద్యానికి బానిస‌ల‌య్యేలా షాపుల్ని తెరిపించేందుకు భిన్నంగా.. అస‌లు మ‌ద్యం మీద వ‌చ్చే ఆదాయంతో ప్ర‌భుత్వాన్ని న‌డిపే ఆలోచ‌నే త‌న‌కు లేద‌న్న ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు విప‌క్ష అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. పార్టీ ప్లీన‌రీ సంద‌ర్భంగా మ‌ద్య నిషేధం మీద ఆయ‌న చెప్పిన మాట‌లు క‌న్వీన్స్ గా  ఉండ‌ట‌మే కాదు.. ప్రాక్టిక‌ల్ గా ఎలా వ‌ర్క్ వుట్ చేయొచ్చన్న‌ది చెప్పారు.

మ‌ద్య నిషేధాన్ని ఒక్క రోజులో అమ‌లు అసాధ్య‌మ‌న్న నిజాయితీ మాట‌ను చెప్పిన జ‌గ‌న్‌.. మూడు ద‌శ‌ల్లో మ‌ద్య ర‌క్క‌సిని త‌రుముతాన‌ని చెప్పిన జ‌గ‌న్ మాట‌లు.. కోట్లాది కుటుంబాల‌కు కొత్త కాంతులయ్యే అవ‌కాశం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మాట‌ల్లో మురిపించే తీరుకు భిన్నంగా.. వేలాది కోట్ల ఆదాయాన్ని వ‌దులుకునేందుకు తమ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్న సంకేతాన్ని స్ప‌ష్టంగా చెప్ప‌ట‌మే కాదు.. ర‌క్త‌పు కూడు లాంటి  మ‌ద్యం మీద రాష్ట్ర ప్ర‌భుత్వానికి వ‌చ్చే ఆదాయం మీద త‌న‌కున్న అస‌హ్యాన్ని స్ప‌ష్టంగా చెప్పేశార‌ని చెప్పాలి.

మూడు ద‌శ‌ల్లో విధించే మ‌ద్య నిషేధం ఎలా ఉంటుంద‌న్న‌ది  చూస్తే..

మొద‌టి ద‌శ‌

దుకాణాల సంఖ్య త‌గ్గించ‌టం. బెల్టు షాపుల‌పై ఉక్కుపాదం. మ‌ద్యం కార‌ణంగా కుటుంబాలు ఎలా నాశ‌న‌మ‌వుతున్నాయ‌న్న విష‌యాన్ని సినిమా.. టీవీల ద్వారా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేయ‌టం. మ‌ద్య నిషేధం కోసం ఉద్య‌మం న‌డిపిన చ‌రిత్ర రాష్ట్ర మీడియాకు ఉన్న నేప‌థ్యంలో వారి స‌హాయ స‌హ‌కారాలు తీసుకోవ‌టం. మ‌ద్యం ధ‌ర‌ల్ని షాకు కొట్టేలా పెంచ‌టం

రెండో ద‌శ‌

మ‌ద్యం ధ‌ర‌ల్ని పేద‌.. మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి అందుబాటులో లేకుండా ఇంకా.. ఇంకా షాకు కొట్టేలా పెంచుతాం. మ‌ద్యం తాగితే క‌లిగే న‌ష్టాలు.. మ‌ద్యం తాగ‌కుంటే క‌లిగే లాభాల్ని మీడియా ద్వారా మ‌రింత‌గా ప్ర‌చారం. ధూమపాన వ్య‌తిరేక ప్ర‌చారం త‌ర‌హాలో మ‌ద్య‌పాన నిషేధానికి కేంద్ర‌.. ఇత‌ర రాష్ట్రాల‌.. ఉన్న‌త న్యాయ‌స్థానాలు ముందుకొచ్చేలా అడుగులు వేయ‌టం. ప్ర‌తి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోనూ రీహాబిలిటేష‌న్ సెంట‌ర్లు ఏర్పాటు చేయ‌టం. మ‌ద్యానికి దూరంగా ఉంటామ‌ని ముందుకొచ్చే వారికి వైద్య‌సాయాన్ని అందించి.. వారికి తోడుగా నిల‌వ‌టం.

మూడో ద‌శ‌

మ‌ద్యాన్ని కోటీశ్వ‌రులు మాత్ర‌మే కొనుగోలు చేసేలా త్రీస్టార్‌..ఫైవ్ స్టార్ హోట‌ల్స్ లో ల‌భించేలా నియంత్ర‌ణ‌. తాగి ఒక‌వేళ అనారోగ్యం పాలైనా.. ఏ అమెరికాకో వెళ్లి వైద్యం చేయించుకునే స్థోమ‌త ఉన్న వారికి మాత్ర‌మే మ‌ద్యం అందుబాటులో ఉంటుంది. మ‌ద్యం త‌యారు చేసినా.. అమ్మినా శిక్ష‌లు భారీగా ఉండేలా చ‌ట్టాల్ని మార్చ‌టం. మ‌ద్యం అమ్మినా.. తాగినా ఏడేళ్లు జైలుకు వెళ్లేలా చ‌ట్టాన్ని మారుస్తాం.
Tags:    

Similar News