కేర‌ళ బాధితుల‌కు జ‌గ‌న్ బాస‌ట‌!

Update: 2018-08-20 10:13 GMT
గ‌త 11 రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు - వరదలతో కేరళ అత‌లాకుత‌ల‌మైన సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ద బీభ‌త్సం ధాగికి కేర‌ళ‌లో ఇప్పటి వరకూ 400 మందికి పైగా మృతి చెంద‌గా..... 6లక్షల మంది నిరాశ్ర‌యుల‌య్యారు. కేర‌ళ‌లో వ‌ర‌ద బాధితుల‌కు ఆప‌న్న హ‌స్త‌మందించేందుకు ఎందరో విరాళాలు - వ‌స్తువులు - ఆహార ప‌దార్థాలు అంద‌జేస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా, కేర‌ళ వ‌ర‌ద బాధితుల కోసం వైసీపీ అధ్య‌క్షుడు - ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ భారీ విరాళం ప్ర‌క‌టించారు. తన తరఫున, పార్టీ తరఫున కేరళ వాసులకు రూ.కోటి రూపాయల విరాళాన్ని జ‌గ‌న్ ప్రకటించారు. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆ మొత్తాన్ని వైసీపీ నేత‌లు జ‌మ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు - కేరళలో పరిస్థితులు త‌న‌ను క‌ల‌చి వేశాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ జగన్ ట్వీట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కేరళ వరద విపత్తు హృదయాన్ని కలిచివేస్తోందని - ఈ కష్టకాలంలో తన ప్రార్థనలు - ఆలోచనలు కేరళ ప్రజల వెన్నంటి ఉంటాయని జ‌గ‌న్ అన్నారు. ఈ ఆప‌త్కాలంలో కేర‌ళ ప్ర‌జ‌ల‌కు సహాయ - పునరావాస చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని జ‌గ‌న్ కోరారు. మ‌రోవైపు, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా తన నెల జీతాన్ని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. వీరితోపాటు, కేరళను ఆదుకోవడానికి వివిధ పార్టీలు - నాయకులు - ప్రముఖులు భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు.


Tags:    

Similar News