బాబు, జగన్.. ఓ ‘అన్న’..

Update: 2019-06-15 04:43 GMT
ఏపీలో ఇప్పుడు 'అన్న' అనే పేరు కామన్.. దానికి ముందు మాత్రమే పేర్లు మారుతున్నాయి. గడిచిన ఐదేళ్లు చంద్రన్న ఆక్రమిస్తే ఈ ఐదేళ్లు రాజన్న దాన్ని భర్తీ చేస్తున్నాడు. పథకాల పేర్లు ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో వేగంగా మారిపోతున్నాయి.

గత ప్రభుత్వంలో అన్న ఎన్టీఆర్- చంద్రన్న పేర్లు మారు మోగాయి. ఇప్పుడా రెండు పేర్ల స్థానంలో రాజన్న- వైఎస్ ఆర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ పేరుతో టీడీపీ గడిచిన సారి జనంలోకి వెళితే..దాన్ని రద్దు చేస్తూ వైఎస్ ఆర్ పేరుతో కొత్త టచ్ ఇస్తోంది వైసీపీ సర్కారు. పథకాల పేర్లు మార్పు ఇప్పుడు ఏపీలో కొత్త చర్చకు దారితీస్తోంది.

2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక వాటన్నింటిని ఎన్టీఆర్, చంద్రన్న పేర్లతో మార్చేశాడు. ఇప్పుడు జగన్ సీఎం కావడంతో వైఎస్ పేరు మళ్లీ పథకాల పేర్లు మారాయి.

గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్పిడిపై టీడీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చంద్రబాబు చేసిందే తాము చేశామని జగన్ సర్కార్ చెబుతోంది. వైఎస్ హయాంలో ప్రవేశ పెట్టిన రాజీవ్ ఆరోగ్య శ్రీ చాలా పాపులర్ స్కీం. దాన్ని చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చింది. ఇక గడిచిన చంద్రబాబు హయాంలో చంద్రన్న బీమా, చంద్రన్న పెళ్లికానుక లాంటివి అమలయ్యాయి.

ఇప్పుడు జగన్ సర్కారు ఎన్టీఆర్ వైద్యసేవను.. వైఎస్ ఆర్ ఆరోగ్యశ్రీగా.. అన్నదాత సుఖీభవను వైఎస్ ఆర్ రైతు భరోసాగా మార్చేసింది. టీడీపీ పసుపు కుంకుమ పేరుతో డబ్బులిస్తే ఎన్టీఆర్ ఆసరా పేరుతో జగన్ సర్కారు పేరుమర్చింది. ఎన్టీఆర్ జలసిరిని.. వైఎస్ ఆర్ జలయజ్ఞంగా మార్చేశారు. ఇక పెన్షన్ల పథకమైన ఎన్టీఆర్ భరోసాను.. వైఎస్ ఆర్ పెన్షన్ పథకంగా జగన్ ప్రభుత్వం మార్చేసింది. ఇక గత ఐదేళ్లు చంద్రన్న బడిబాటను రాజన్న బడిబాటగా సీఎం జగన్ మార్చేశారు.

రాజకీయం ఎలా ఉన్నా.. పేర్లు ఏవీ ఉన్నా.. పథకాల ద్వారా జనాలకు మంచి జరిగితే అదే పదివేలు అని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News