ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థులు ఒకరిపై ఒకరు పంచ్ లు వేసుకోవటం మామూలే. ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వెలువడిన తర్వాత విమర్శల కంటే కూడా పాలన మీద దృష్టి పెడుతుంటారు. అయితే.. చారిత్రక తప్పు చేసిన చంద్రబాబుకు చెప్పాల్సిన మాటలు కొన్ని ఉన్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రిగా కొద్ది రోజుల్లో ప్రమాణస్వీకారం చేయనున్న జగన్ తాజాగా తన ఫస్ట్ పంచ్ వేశారు.
ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించిన తర్వాత జగన్ మాట్లాడుతూ.. గెలుపు మీద తప్పించి ఒక్క రాజకీయ విమర్శ చేసింది లేదు. ఆర్నెల్లు.. ఏడాది వ్యవధిలో తాను మంచి సీఎంను అనిపించుకుంటానని ప్రజలకు మాటివ్వటం తెలిసిందే. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మీద అనూహ్యంగా విసిరిన ఫస్ట్ పంచ్ సూటిగా తగలటమే కాదు.. నిజమే కదా? దేవుడు భలే చేశాడనేలా ఉంది. అన్యాయం.. అధర్మం చేస్తే దేవుడు తప్పక శిక్షిస్తాడు. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి అక్రమంగా 23 మంది ఎమ్మెల్యేల్ని లాక్కున్నారు. అయితే ఇప్పుడు టీడీపీలో 23 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా గెలిచారు. మే 23నే చంద్రబాబుకు దేవుడు తగిన బుద్ధి చెప్పారన్నారు. 2024లో మరింత మెజార్టీతో పార్టీ విజయం సాధించాలి. సుపరిపాలన.. అభివృద్ధి మీద దృష్టి పెడదాం.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా పాలన అందిద్దామన్న ఆయన.. ఏపీలో 50 శాతం ఓటింగ్ సాధించటం గొప్ప విషయంగా పేర్కొన్నారు. ఇంకా.. ప్రమాణస్వీకారం చేయకుండానే 2024 ఎన్నికల ఫలితాల్ని జగన్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అధినేత మాటల్ని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆసక్తిగా చర్చించుకోవటం కనిపించింది.