అప్పుడు రాళ్ల వర్షం.. జగన్ కు ఇప్పుడు రాజ సత్కారం!

Update: 2019-06-21 08:16 GMT
అతిథి దేవో భవ… అన్నట్టుగా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సభలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పడ్నవీస్ ను, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని భారీ స్థాయిలో సత్కరించారు తెలంగాణ సీఎం కేసీఆర్. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించి వారి చేతే కీలకమైన ప్రారంభోత్సవాలను చేయించారు కేసీఆర్. తద్వారా వారికి అపురూప గౌరవాన్ని అందించారు కేసీఆర్. ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాల్సిన అంశం ఒకటి ఉంది.

ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం అయిన ప్రాంతానికి సమీపంలోనే మానుకోట ఉంటుంది! ఈ అంశాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. కొన్ని సంవత్సరాల కిందట మానుకోట లో తెలంగాణ రాష్ట్ర సమితి వారి నుంచి తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఇప్పుడు జగన్ కు అపురూప స్వాగతం పలకడంలో తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణుల కృషి చాలానే ఉంది. భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వారు జగన్ కు స్వాగతం పలికారు.  తెలంగాణ ప్రభుత్వంతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి వారు కూడా జగన్ ను భారీ ఎత్తున సత్కరించారు. ఇలా జగన్ కు రాజ సత్కారం అందించారు.

అయితే ఈ వర్గాలే అప్పుడు జగన్ మీద రాళ్ల వర్షాన్ని కురిపించారు. ఓదార్పు యాత్రలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి అప్పుడు  మానుకోట ప్రాంతానికి వచ్చారు. రైలు  మార్గం ద్వారా అక్కడి వరకూ చేరుకున్నారు జగన్ మోహన్ రెడ్డి. అయితే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయిలో ఉండగా జగన్ మోహన్ రెడ్డి అప్పుడు మానుకోటకు రావడాన్ని టీఆర్ ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. తెలంగాణ వాదుల రూపంలో అప్పుడు జగన్ మీద వారు విరుచుకుపడ్డారు. జగన్ రైలు బోగీలోనే ఉండిపోగా.. బోగీపై తీవ్ర స్థాయిలో రాళ్ల వర్షం కురిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు అలా దాడి చేశారు. వారిని కంట్రోల్ చేయడం కూడా పోలీసులకు సాధ్యం కాలేదు.

దీంతో వారు జగన్ ను వెనక్కు తిప్పి పంపారు. ఓదార్పు యాత్రను చేపట్టకుండానే జగన్ తిరిగి రావాల్సి వచ్చింది. అప్పుడు కొండా సురేఖ దంపతులు జగన్ కు అండగా నిలబడినా.. అధికార పార్టీ నుంచి కూడా అప్పుడు జగన్ కు సహకారం లేకపోవడంతో యాత్ర లేకుండానే వెనుదిరిగారు.

అలాంటి అనుభవాన్ని పొందిన ప్రాంతానికి సమీపంలోనే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డికి ఘన సత్కారం అందింది. ఆయనకు తెరాస శ్రేణులు ఘన స్వాగతం పలికాయి! రాళ్లదాడి ని ఎదుర్కొన్న చోటే జగన్ ఇప్పుడు రాజ సత్కారం పొందడం గమనార్హం.t

    
    
    

Tags:    

Similar News