తెగించినోడికి ఎవరైతే ఏమిటన్నట్లు ఉంటారు. ఇప్పుడదే విధంగా వ్యవహరిస్తున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తాజాగా జంప్ అయిన ఎమ్మెల్యేలు. తన గూటి నుంచి వెళ్లిపోయి సైకిల్ ఎక్కి షికారు చేస్తున్న ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేందుకు విప్ జారీ చేశారు. అధినేతకే అన్ని తెలివితేటలు ఉంటే.. ఆయన్ను ఫాలో అయి పక్క పార్టీలోకి వెళ్లిపోయిన ఒకనాటి శిష్య గణానికి మరెన్ని తెలివితేటలు ఉండాలి. అందుకే.. ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగే చర్చ సందర్భంగా తన ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ సమావేశానికి హాజరు కావాలంటూ జగన్ పార్టీ విప్ జారీ చేసింది.
తమ పార్టీకి చెందిన ప్రతి ఎమ్మెల్యే తప్పనిసరిగా పాల్గొనాలని.. ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని.. లేకుండా అనర్హత వేటుపడుతుందని హెచ్చరించింది. జగన్ పార్టీ విప్ విషయంలో.. ఆ పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలు ఎలా రియాక్ట్ అవుతారన్న ఉత్కంట వ్యక్తమైంది. అయితే.. తమ మాజీ అధినేత నుంచి వచ్చిన విప్ ను లైట్ తీసుకున్న వారు.. అసెంబ్లీకి గైర్హాజరు అయ్యారు.
అసెంబ్లీకి డుమ్మా కొట్టిన వారిలో ఇప్పటికే పార్టీ మారిన 8 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు.. తాజాగా పార్టీ మారనున్నట్లు ప్రకటించిన జోత్యుల నెహ్రు.. వరువుల సుబ్బారావులు అసెంబ్లీకి హాజరు కాలేదు. విప్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వేటు పడే అవకాశం ఉన్నా.. అదంతా తమ తాజా అధినేత చూసుకుంటారన్న ధీమాతో జగన్ పార్టీ విప్ నకు గైర్హాజరు కావటం ద్వారా ఏపీ విపక్ష నేతకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారనే చెప్పాలి.