జనసేన అధినేత పవన్ కల్యాన్ ఈసారి ఏపీ ఎన్నికల బరిలో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే... ఒకటి భీమవరం, రెండోది గాజువాక. భీమవరం సంగతి పక్కనబెడితే గాజువాక గురించే ఇప్పుడు చర్చంతా.. ఎందుకంటే మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పవన్ కు ఇక్కడ ఎదురుగాలి లేదనే చెప్పాలి ఎందుకంటే అధికారంలో ఉన్న టీడీపీ తరుపున పల్లా శ్రీనివాస్ ను బరిలో ఉంచారు. అయితే ఆయన ప్రచారం చేస్తున్నా ఎక్కువగా పవన్ కున్న అభిమానంతో ఆయనవైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తన తరుపున ప్రచారం చేయడానికి చంద్రబాబును రావాలని పళ్లా శ్రీనివాస్ కోరారట..
అయితే విశాఖ జిల్లా మొత్తం పర్యటిస్తున్న బాబు గాజువాకకు మాత్రం రావడం లేదట. దీంతో జనసేన, టీడీపీల మధ్య లోపాయికార ఒప్పందాలున్నాయిన వైసీపీ నేతలు బాహటంగానే ఆరోపిస్తున్నారు. కానీ పవన్ మాత్రం తమకు టీడీపీ, వైసీపీలు రెండూ ప్రత్యర్థులేనని చెప్పుకొస్తున్నారు. కానీ బాబు వస్తే మాత్రం పవన్ చెప్పిన మాటలకు బలం చేకూరే అవకాశం ఉంది. లేకుంటే వైసీపీ ఆరోపణలే నిజయమ్యేలా కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా వైసీపీ తరుపున కూడా బలమైన అభ్యర్థి కాకుండా సాధారణ అభ్యర్థిని బరిలోకి దించారని ప్రచారం జరుగుతోంది. కానీ జగన్ మాత్రం గాజువాకలో పర్యటిస్తానంటున్నాడు. ఎన్నికల ప్రచారం ఈనెల 9న ముగుస్తుంది. దీంతో అదేరోజు గాజువాకలో పర్యటించి పవన్ దూకుడుకు బ్రేకులు వేస్తానని అంటున్నారు. పవన్ 'అత్తారింటికి దారేదీ' సినిమాలో చెప్పిన డైలాగ్ 'లాస్ట్ పంచ్ మనదైతే.. ఆ కిక్కే వేరబ్బా' అనేది అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే ఇప్పుడు పవన్ కాకుండా దానిని జగన్ ఫాలో అవుతున్నాడు.
ప్రచారం చివరి రోజున పవన్ నియోజకవర్గంమైన గాజువాకలో పర్యటించి పవన్ ను ఓడిస్తానని జగన్ చెబుతున్నాడు. అయితే జగన్ లాస్ట్ పంచ్ పర్యటనతో పవన్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందా..? లేదా..? అనేది చూడాలి.