సీఎం జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం: రైతుల‌కు క్రెడిట్ కార్డు

Update: 2020-05-05 15:30 GMT
కొన్ని విభిన్న ప‌థ‌కాలు తీసుకొస్తూ ప్ర‌జ‌ల‌కు మేలు చేసేలా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే అనేక ప‌థ‌కాలు, సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు. ప‌రిపాల‌న‌లో విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. తాజాగా రైతుల కోసం కొత్త ప‌థ‌కం తీసుకురావాల‌ని భావిస్తున్నారు. ఇప్ప‌టికే రైతుల కోసం రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఆ కేంద్రాల ద్వారా రైతుల‌కు విత్త‌నాలు, ఎరువులు అందిస్తున్నారు. వ‌ర్షాకాలం స‌మీపి‌స్తుండ‌డంతో వ్య‌వ‌సాయంపై మంగ‌ళ‌వారం స‌మీక్ష చేశారు. రైతుల‌కు కావాల్సిన విత్త‌నాలు, ఎరువులు అందుబాటులో ఉంచాల‌ని సంబంధిత అధికారుల‌కు ఆదేశించారు.

ఈ క్ర‌మంలో రైతులకు సాగు కోసం పెట్టుబ‌డిపై వినూత్న ఆలోచ‌న చేశారు. రైతుల‌కు బ్యాంకు ఖాతాలు త‌ప్ప‌నిస‌రి చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారికి డెబిట్‌, క్రెడిట్ కార్డులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. అక్టోబ‌ర్ వ‌ర‌కు రైతుల‌కు వాటిని అందించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈ సంద‌ర్భంగా సంబంధిత అధికారుల‌కు సీఎం జ‌గ‌న్ ఆదేశించారు. రైతు భ‌రోసా కేంద్రాల ద్వారా రైతుల‌కు విత్త‌నాలు, ఎరువులు అందించాల‌ని తెలిపారు. మ‌త్య్స‌కార, రైతు భ‌రోసా ల‌బ్ధిదారుల జాబితాల‌ను గ్రామ స‌చివాల‌యాల్లో ప్ర‌ద‌ర్శించాల‌ని సూచించారు.
Tags:    

Similar News