రోజుకోర‌కంగా బాబును ఇరికిస్తున్న జ‌గ‌న్‌

Update: 2018-05-09 15:28 GMT
వైసీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నిర్విరామంగా కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. పాద‌యాత్ర మీడియాకు పాత‌బ‌డినా.. జ‌న‌ స్పంద‌న మాత్రం రోజురోజుకు పెరుగుతోంది. యువ‌త జ‌గ‌న్‌ను క‌ల‌వ‌డానికి ఎగ‌బ‌డుతోంది. న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్లో బాబు కంచుకోట‌ల్లో కూడా ప్ర‌జ‌లు జ‌న‌నేత జ‌గ‌న్ కు అడుగ‌డుగునా నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో తాము అనుభ‌వించిన క‌ష్టాల‌ను టీచ‌ర్ల నుంచి కూలీల వ‌ర‌కు జ‌గ‌న్‌తో ప్ర‌జ‌లు ఏక‌రువు పెట్టుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పాల‌న‌ను పాయింట్ టు పాయింట్ ఎండ‌గ‌డుతూ ...రోజుకో అంశంపై జ‌గ‌న్ స‌వివ‌రంగా విరుచుకుప‌డుతూంటే... జ‌గ‌న్ ఇంత డెప్త్‌గా అనాలిసిస్ చేస్తున్నాడా అని రాజ‌కీయ విశ్లేష‌కులే ఆశ్చ‌ర్య‌పోతున్నారట‌.  ఎన్టీఆర్ గృహ‌క‌ల్ప‌లో అవినీతిని ప్ర‌శ్నిస్తూ రూపాయి లేకుండా ఇల్లు ఇస్తాన‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు జ‌గ‌న్‌. అలాగే అంగ‌న్ వాడీ కార్య‌క‌ర్త‌ల స‌మ‌స్య‌లు విని తెలంగాణ కంటే ఎక్కువ జీతాలు ఇస్తాన‌ని వారికి హామీ ఇచ్చాడు. ఉపాధ్యాయుల కాంటెప్ర‌రీ పెన్ష‌న్ విధానం ఇపుడు ఏపీలో పెద్ద చ‌ర్చ‌. ఆ విష‌యంలో కూడా జ‌గ‌న్ సానుకూలంగా స్పందించి పాత పెన్ష‌న్ విధానానికి ఓకే చెప్పారు. ఈ హామీలు ఒక్కోటీ ఆయా వ‌ర్గాల ఓట్ల‌ను భారీగా ప్ర‌భావితం చేసేవే. ఇటువంటి ప‌లు అంశాల‌లో చంద్ర‌బాబు చేసిన త‌ప్పుల‌ను జ‌న భాష‌లో జ‌గ‌న్ తూర్పార‌బ‌డుతుంటే జ‌నం నుంచి భారీ స్పంద‌న క‌నిపిస్తోంది. తాజాగా, నేడు మ‌రోసారి చంద్ర‌బాబుపై జ‌గ‌న్ నిప్పులు చెరిగారు.

ఎన్నికలు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌పుడే దళితులపై చంద్ర‌బాబుకు ప్రేమ పొంగుకు వ‌స్తుంద‌ని జ‌గ‌న్ మండిప‌డ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో దళితుల పట్ల వివక్ష స్ప‌ష్టంగా కనిపిస్తోందని, స్వాతంత్ర్యం వ‌చ్చి 70 ఏళ్లు గడుస్తున్నా....ఇప్ప‌టికీ దళితులు పోరాటాలు చేయాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని అన్నారు. టీడీపీ హ‌యాంలో.....గ‌ర‌గ‌ప‌ర్రు, పెందుర్తి...త‌ర‌హాలో రాష్ట్రంలో ప‌లు చోట్ల ద‌ళితులపై నేటికి దాడులు జరుగుతుండటం సిగ్గుచేట‌న్నారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా పెరికగూడెంలో ‘దళిత ఆత్మీయ సమ్మేళనం’లో ప్ర‌సంగించిన జగ‌న్...చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు.

య‌థా రాజా త‌ధా ప్ర‌జ అన్న రీతిలో......ముఖ్యమంత్రి చంద్ర‌బాబు చూపిన బాట‌లోనే టీడీపీ నేత‌లు కూడా ప‌య‌నిస్తున్నార‌ని జ‌గ‌న్ ఎద్దేవా చేశారు. ఎస్టీలకు తెలివి లేద‌ని......దళితుడిగా పుట్టాలని ఎవ‌రైనా కోరుకుంటారా? అని చంద్ర‌బాబు చేసిన‌ వ్యాఖ్య‌ల‌ను టీడీపీ నేతలు ఆద‌ర్శంగా తీసుకొని దళితులపై దారుణాలకు పాల్ప‌డుతున్నార‌ని జ‌గ‌న్ నిప్పులు చెరిగారు. దళితులు శుభ్రంగా ఉండరని, స‌రిగా చ‌దువుకోర‌ని మంత్రి ఆదినారాయణ వ్యాఖ్యలు అందుకు నిద‌ర్శ‌న‌మన్నారు. త‌న కేబినేట్‌లోని మంత్రి ఈ విధంగా మాట్లాడి ఉంటే త‌క్ష‌ణ‌మే బర్త‌రఫ్‌ చేసేవాడిన‌ని జ‌గ‌న్ అన‌డంతో చ‌ప్ప‌ట్లు మారుమోగాయి.  పేదవాళ్లను ప్రేమ‌గా పలకరించలేని వారు సీఎం పదవిలో ఉండటానికి అనర్హులని జగన్ వ్యాఖ్యానించారు. స్వ‌యంప్ర‌క‌టిత `దళిత తేజం`చంద్ర‌బాబు....మ‌రోసారి సీఎం అయితే రాష్ట్రంలోని దళితుల ప‌రిస్థితిని ఊహించ‌లేమ‌ని జ‌గ‌న్ అన్నారు. నాలుగేళ్ల పాలనలో దళితులకు చంద్ర‌బాబు చేసిన మేలు ఏమిటో చెప్పాల‌ని జ‌గ‌న్ నిల‌దీశారు. కారంచేడు ఘటన నుంచి పెందుర్తి ఘ‌ట‌న వ‌ర‌కు టీడీపీ హ‌యాంలో ద‌ళితుల‌పై వివ‌క్ష కొన‌సాగుతూనే ఉంద‌న్నారు.

ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదాపై, అవిశ్వాస తీర్మానం పై యూట‌ర్న్ తీసుకున్న చంద్ర‌బాబు ఇమేజ్ ఫుల్ గా డ్యామేజ్ అయింది. దానికితోడు రోజుకో అంశంపై చంద్ర‌బాబును జ‌గ‌న్ ఇర‌కాటంలో ప‌డేయడంతో మూలిగే న‌క్క‌పై తాటికాయ ప‌డిన చందంగా త‌యారైంది ముఖ్య‌మంత్రిగారి ప‌రిస్థితి.  అస‌లే చంద్ర‌బాబు గ్రాఫ్ ప‌డిపోయి ఫ్ర‌స్ట్రేష‌న్ తో నానా తిప్ప‌లు ప‌డుతుంటే....మ‌రోవైపు జ‌గ‌న్ విమ‌ర్శ‌ల దాడిచేయ‌డంతో సీఎం సాబ్ ఉక్కిరిబిక్కిర‌వుతున్నారు. బ్రిటిషు వారిపై పోరాడిన జాతి....తెలుగుదేశం పార్టీ....అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించ‌డం ఆయ‌న‌ ఫ్ర‌స్ట్రేష‌న్ పీక్స్ కు చేరింద‌న‌డానికి నిద‌ర్శనం. ఇప్పుడే చంద్ర‌బాబు ప‌రిస్థితి ఇలా ఉంటే.....ముందు ముందు జ‌గ‌నాస్త్రాల‌ను త‌ట్టుకొని రాబోయే ఎన్నిక‌ల బ‌రిలో ఎంత‌వ‌ర‌కు నిల‌బ‌డ‌గ‌ల‌ర‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఏదేమైనా....చంద్ర‌బాబుకు `ముందుంది మొస‌ళ్ల పండ‌గ` అని చెప్ప‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఉందంటే అతిశ‌యోక్తి కాదు.
Tags:    

Similar News