సినీ తారలు - సెలబ్రిటీలు - రాజకీయ నాయకులు - క్రీడాకారులు....వీరందరూ తమ కెరీర్ కోసం ఎక్కువ సమయం కేటాయించడంతో ఫ్యామిలీని మిస్ అవుతుంటారు. అయితే, కొందరు మాత్రం...సమయం - వీలు చిక్కినప్పుడల్లా కుటుంబసభ్యులతో స్వదేశంలోనో - విదేశంలోనో సరదాగా గడుపుతూ ఆ లోటును తీరుస్తుంటారు. ఇదే తరహాలో నిత్యం ప్రజాసేవలో క్షణం తీరిక లేకుండా గడిపే ఏపీ ప్రతిపక్ష నేత - వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా గత ఏడాది తనకు దొరికిన అతి కొద్ది సమయాన్ని ఫ్యామిలీతో గడిపేందుకు న్యూజిల్యాండ్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, ఆ టూర్ లో జగన్ ఎంతో రిస్క్ తో కూడిన సాహసం చేశారన్న వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంతో ప్రమాదరకరమైన బంగీ జంప్ ను జగన్ అవలీలగా చేసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Full View
గత ఏడాది మేలో తన కుటుంబంతో కలిసి జగన్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జగన్....తన భార్య - పిల్లలతో విలువైన సమయాన్ని గడిపారు. అక్కడ అనేక పర్యాటక ప్రాంతాల్లో పర్యటించారు. న్యూజిలాండ్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతాన్ని సందర్శించిన జగన్ ఓ సాహసం చేశారు. అత్యంత ఎత్తైన `కవారా` బ్రిడ్జ్ పై నుంచి జగన్ అవలీలగా బంగీ జంప్ చేసి ఔరా అనిపించారు. ప్రస్తుతం జగన్ బంగీ జంప్ నకు సంబంధించిన ఫొటోలు - వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమ అభిమాన నేత చేసిన సాహసాన్ని చూసిన జగన్ అభిమానులు ఫిదా అయ్యారు. నాడు బంగీ జంప్ చేసినా....నేడు పాద యాత్ర చేసినా....రిస్క్ తీసుకోవడంలో జగన్ కు సాటి మరెవరూ లేరంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. సాహసమే ఊపిరిగా సాగిపోయే జగన్....త్వరలోనే ఏపీకి డైనమిక్ సీఎం అవుతారని కామెంట్స్ పెడుతున్నారు.