తమ పార్టీ ఎమ్మెల్యేలను జంప్ చేయకుండా ఆపేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలం అవుతుండంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ రూటు మార్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేందుకు అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపుల అస్త్రం ప్రయోగించినా చివరికి అధికార తెలుగుదేశం పార్టీదే పైచేయి కావడంతో జగన్ కొత్త ఆలోచన చేస్తున్నారు. పార్టీ గుర్తుపై గెలిచి..అధికార పార్టీ ఇచ్చే అఫర్లకు లొంగిపోయారంటూ నేరుగా ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయించారు.
పార్టీ ఫిరాయింపుదారులను ఎండగట్టడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందుకోసం ఇటీవల తమ పార్టీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనలో ఉంది. గతంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చేపట్టిన ధర్నాలకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని ''మహాధర్నా''లు చేపట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో సమస్యలను సమస్యలను ఎత్తి చూపడమే కాకుండా ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ప్రభుత్వంపై ఎదురుదాడి చేయాలనే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉంది. ముఖ్యంగా తమ పార్టీ టికెట్‌పై గెలిచిన నేతలు, రాజీనామా చేయకుండా ఇతర పార్టీలో వెళ్లడం సమంజసం కాదనే వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ఇందులో కీలకమైన అజెండాగా చెప్తున్నారు. జగన్ కొత్త స్కెచ్ బానే ఉన్నట్లుంది కదూ?