తను ఒక నిర్ణయం తీసుకునే ముందు జగన్ పార్టీలోని కీలక నేతలు అందరితోనూ ఒక సమావేశం నిర్వహించుకుంటారు. కానీ, ఆ సమావేశంలో తనకంటె పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అందరూ కూడా.. మూకుమ్మడిగా.. ''మీ ఇష్టం సార్.. మీరు ఎలా నిర్ణయిస్తే అలా నడుచుకుందాం'' అని చెప్పాలని.. సకల నిర్ణయాధికారాన్ని తన చేతిలో పెట్టాలని ఆయన ఆశిస్తారు. వయసులో తన తండ్రిని మించిన వారైనా సరే.. తనను సార్ అని పిలవాలని కోరుకునే యాటిట్యూడ్ ఉన్న జగన్.. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యానికి, నాయకుల అభిప్రాయాలకు విలువ ఇస్తారనుకోవడం కల్ల. అలాగే ఆయన అమరావతి శంకుస్థాపనకు హాజరు కాకూడదంటూ ఇవాళ తీసుకున్న నిర్ణయం కూడా ఒంటెత్తు పోకడే అని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
శంకుస్థాపన కార్యక్రమానికి తాము డుమ్మా కొడితే.. దానివలన ప్రజల్లోకి భిన్నమైన సంకేతాలు వెళతాయని.. పలువురు వైకాపా నాయకులు తమలో తాము అనుకుంటున్నారు. ఇప్పటికే అభివృద్ధిని చూసి సహించలేకపోతున్నాం అని.. అభివృద్ధిని అడ్డుకుంటున్నాం అని తమ మీద బోలెడు నిందలు పడుతున్నాయని.. కొత్తగా.. కనీసం శంకుస్థాపనను చూసి ఓర్చుకోలేకపోతున్నారనే నిందకూడా పడాల్సి వస్తుందని వారంటున్నారు.
నిజానికి జగన్ గురువారం నాడు తన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నాయకుల సమావేశంలో కొందరు పెద్దలు.. ఈ విషయాన్ని మెత్తగానే జగన్‌కు తెలియజెప్పే ప్రయత్నం కూడా చేశారుట. అయితే జగన్ మాత్రం పట్టించకోలేదని సమాచారం. కార్యక్రమానికి వెళ్లకపోతే.. పార్టీకి చెడ్డపేరు తప్పదని.. జగన్ మాటకు ఇక పార్టీలో తిరుగులేదు గనుక.. తాము అన్నిటికీ సిద్ధపడి ఉండాల్సిందేనని ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు.