క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు, ప్రజలందరికీ సుపరిపాలన అందించేందుకు వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నిర్విరామంగా, నిర్విఘ్నంగా కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. మాట తప్పని, మడమ తిప్పని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తోన్న జగన్ మండుటెండలను సైతం లెక్కచేయకుండా పాదయాత్రను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. తూర్పు గోదావరి జిల్లాలోని లక్కవరం చేరుకోవడంతో జగన్ పాదయాత్ర 2400 కిలోమీటర్ల మైలురాయిని అందుకుంది. మొక్కవోని దీక్షతో నిరాటంకంగా కొనసాగిస్తోన్న ప్రజాసంకల్ప యాత్ర 195వ రోజు సందర్భంగా జగన్ ఈ మైలురాయిని అధిగమించారు. ప్రజా సంకల్ప యాత్ర 2400 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా లక్కవరంలో జగన్ ఓ మొక్కను నాటారు.
దివంగత మహానేత వైఎస్ బాటలోనే ఆయన తనయుడు జగన్ పయనిస్తున్నారు. తన పాదయాత్రతో ప్రజాసమస్యలను తెలుసుకొని అధికారం చేపట్టిన వైఎస్ తరహాలోనే జగన్ కూడా ప్రజాసంకల్ప యాత్రను చేస్తున్నారు. నవంబర్ 6వ తేది, 2017లో ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరిలో కొనసాగుతోంది. ఇప్పటికి 9 జిల్లాలో విజయవంతంగా కొనసాగిన పాదయాత్ర పదో జిల్లా అయిన తూర్పుగోదావరిలో జగన్ కు జనం నీరాజనాలు పడుతున్నారు. లక్కవరం చేరుకోవడంతో ఈ యాత్ర 2400 కిలో మీటర్లు పూర్లయింది. ఈ సందర్భంగా లక్కవరంలో జగన్ ఒక మొక్కను నాటారు. ఆ తర్వాత పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు....జననేతకు జేజేలు కొట్టి అభినందనలు తెలిపారు.